Share News

గుడ్లనుకొని గోల్ఫ్ బాల్స్‌ను మింగేసిన పాము.. చివరకు..

ABN , Publish Date - Sep 26 , 2026 | 04:44 PM

తెల్లగా, గుండ్రంగా కనిపించడంతో గుడ్లనుకొనిందో ఏమో గోల్ఫ్ బంతులను మింగిందో పాము. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు గోల్ఫ్ బంతులను మింగేసింది. అమెరికాలోని టెక్సస్ రాష్ట్రం సాన్ ఆంటోనియో సిటీలో ఈ ఘటన జరిగింది.

గుడ్లనుకొని గోల్ఫ్ బాల్స్‌ను మింగేసిన పాము.. చివరకు..

ఇంటర్‌నెట్ డెస్క్: తెల్లగా, గుండ్రంగా కనిపించడంతో గుడ్లనుకొనిందో ఏమో గోల్ఫ్ బంతులను మింగిందో పాము. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు గోల్ఫ్ బంతులను మింగేసింది. అమెరికాలోని టెక్సస్ రాష్ట్రం సాన్ ఆంటోనియో సిటీలో ఈ ఘటన జరిగింది. బంతులను మింగిన తర్వాత పాము స్పృహ లేకుండా పడి ఉండడాన్నికొంతమంది గమనించారు. తర్వాత పామును సౌత్ టెక్స్ ఏవియన్ అండ్ ఎగ్జోటిక్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. దానిని పరీక్షించిన వెటర్నరీ వైద్యులు.. లోపల గోల్ఫ్ బంతులు ఉన్నట్లు గుర్తించారు. అదృష్టవశాత్తు సర్జరీ చేయాల్సిన అవసరం లేకుండానే బంతులను తొలగించారు. మొదట పాముకు మత్తు మందు ఇచ్చి ఒక బంతిని తొలగించారు. లోపల ఇంకా రెండు బంతులు ఉన్నట్లు గుర్తించారు. అలా మూడు బంతులను మెల్లగా దాని శరీరం గుండా పైకి పంపుతూ నోటి ద్వారా బయటకు తీశారు.


ఇదో గొప్ప అనుభవం..

సర్జరీ చేయకుండానే పాము శరీరం లోపలి నుంచి గోల్ఫ్ బంతులను బయటకు తీస్తున్న దృశ్యాలను డాక్టర్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పాము శరీరం నుంచి గోల్ఫ్ బాల్స్‌ను సర్జరీ లేకుండా బయటకు తీయడం తమకు గొప్ప అనుభవమని ఆ ఆసుపత్రి డాక్టర్లు చెప్పారు. ఇక ఆ వీడియో వెలుగులోకి రావడంతో యూజర్లు వివిధ రకాలుగా స్పందించారు. గోల్ఫ్ బాల్స్‌ను చూసి పాము పొరబడి గుడ్లనుకొని ఉండవచ్చని, అందుకే వాటిని మింగేసిందని పలువురు కామెంట్లు చేశారు. మొత్తానికి పాము శరీరం నుంచి వైద్యులు ఆ బంతులను బయటకు తీసి దానిని రక్షించారని, దీంతో పాముకు పెద్ద ప్రమాదం తప్పినట్లయిందన్నారు. డాక్టర్లు చేసిన పనిని చాలా మంది నెటిజన్లు మెచ్చుకున్నారు. పాముకు మళ్లీ జీవం పోశారని అన్నారు.


ఇవీ చదవండి:

బాంబర్లు దూసుకెళ్లిన వేళ.. ట్రంప్‌ ఉలిక్కిపాటు! జిన్‌పింగ్‌ కూల్‌గా.!

పెన్సిల్‌ మొనపై ‘చిన్న’ గణేశుడు.. కళాకారుడి అద్భుత సృష్టి!

Updated Date - Sep 26 , 2026 | 06:46 PM