Share News

9 ఏళ్ల తర్వాత యజమాని చెంతకు చేరిన చిలుక.. ఎలా కనిపెట్టారంటే..

ABN , Publish Date - Aug 26 , 2026 | 09:04 AM

సాధారణంగా పెంపుడు చిలుకలు ఒకసారి దూరమయ్యాయంటే ఇక తిరిగి రావడం దాదాపు అసాధ్యం. అయితే బ్రిటన్‌కు చెందిన రాబర్ట్ మోర్టిమర్‌కు మాత్రం తన పెంపుడు చిలుక ఏకంగా 9 ఏళ్ల తర్వాత తిరిగి దొరికింది.

9 ఏళ్ల తర్వాత యజమాని చెంతకు చేరిన చిలుక.. ఎలా కనిపెట్టారంటే..
Stolen parrot reunited after 9 years

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా పెంపుడు చిలుకలు ఒకసారి దూరమయ్యాయంటే ఇక తిరిగి రావడం దాదాపు అసాధ్యం. అయితే బ్రిటన్‌కు చెందిన రాబర్ట్ మోర్టిమర్‌కు మాత్రం తన పెంపుడు చిలుక ఏకంగా 9 ఏళ్ల తర్వాత తిరిగి దొరికింది. ఇక చిలుక దొరికిన తీరు కూడా విచిత్రంగానే ఉంది. రాబర్ట్‌కు తన పెంపుడు చిలుక తొమ్మిదేళ్ల తర్వాత ఐకియా పార్కింగ్ లాట్‌లో దొరికింది (Stolen parrot reunited after 9 years).


బ్రాడ్‌ఫోర్డ్‌లోని రాబర్ట్ మోర్టిమర్‌ ఇంట్లో 2017లో దొంగతనం జరిగింది. ఆయన ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న బార్నీ అనే ఆఫ్రికన్ గ్రే చిలుక కూడా అప్పట్నుంచే కనిపించకుండా పోయింది. దొంగలు ఇంట్లోని ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు బార్నీని కూడా ఎత్తుకెళ్లారు.

parrot2.jpg


అప్పట్లో చిలుక కోసం మోర్టిమర్ పోస్టర్లు వేయడంతో పాటు, దాన్ని తిరిగి అప్పగించిన వారికి రివార్డు కూడా ప్రకటించారు. అయినా ఎలాంటి సమాచారం లభించలేదు. ఇక బార్నీ తిరిగి వస్తుందనే ఆశను మోర్టిమర్ దాదాపుగా వదిలేశారు. అలాంటి సమయంలో స్థానిక పోలీసు అధికారి నుంచి ఆయనకు ఫోన్ వచ్చింది (UK parrot Barney).


'మీ చిలుక దొరికింది' అని పోలీసులు చెప్పడంతో మోర్టిమర్ నమ్మలేకపోయారు (Stolen pet found). దాదాపు తొమ్మిదేళ్లు కావడంతో అది నిజంగా బార్నీ అయి ఉండకపోవచ్చని మొదట భావించారు. అయితే బార్నీకి అమర్చిన మైక్రోచిప్‌ను స్కాన్ చేయడంతో పేరు, గతంలో యజమాని బ్రాడ్‌ఫోర్డ్‌ వివరాలు బయటపడ్డాయి. దీంతో మోర్టిమర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.


ఇవి కూడా చదవండి..

ఇరాన్‌తో మా సంబంధాల్లో మీ జోక్యం వద్దు.. అమెరికాకు చైనా వార్నింగ్..


కొద్దిగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Aug 26 , 2026 | 09:08 AM