రూల్స్ అతిక్రమించిన యువకులు.. ట్రాఫిక్ పోలీస్ వెరైటీ శిక్ష.. వీడియో వైరల్
ABN , Publish Date - Jul 23 , 2026 | 02:56 PM
ట్రాఫిక్ నియమాలు అతిక్రమించిన వాహనదారులకు పోలీసులు చలానాలు రాస్తారు. బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోయినా.. ఇద్దరు మించి బైక్‌పై ప్రయాణం చేస్తున్నా కేసులు రాస్తారు. అయితే తాజాగా వైరల్ అవుతోన్న వీడియోలో బైకర్లకు పోలీసులు వినూత్నమైన శిక్ష విధించారు.
ఇంటర్నెట్ డెస్క్: ట్రాఫిక్ నియమాలు అతిక్రమించిన వాహనదారులకు పోలీసులు చలానాలు రాస్తారు. బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోయినా.. ఇద్దరు మించి బైక్‌పై ప్రయాణం చేస్తున్నా కేసులు రాస్తారు. కానీ ట్రాఫిక్ నియమాలు అతిక్రమించి.. వాహనం నడుపుతున్న వారికి పోలీస్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారికి చలానాలు రాయలేదు. కేసు బుక్ చేయలేదు. కానీ వారికి వింత శిక్ష విధించారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. యాక్టివాపై ఒకరు ఇద్దరు కాదు.. నలుగురు యువకులు వేగంగా రహదారిపై దూసుకుపోతున్నారు.
అదే రహదారిపై వస్తున్న పోలీసు అధికారి.. ఆ వాహనాన్ని ఆపారు. ఇలా ప్రయాణించడం తప్పు అంటూ వారిని సున్నితంగా మందలించారు. ఆ బైక్‌ను తన సెల్ ఫోన్‌తో ఫొటో తీశారు. మరోసారి ఇలా ప్రయాణం చేస్తే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని వారిని హెచ్చరించారు. అనంతరం వారందరి చేత మొక్కలు నాటించి.. నీళ్లు పోయించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. afaqkhan_tsi_kannauj అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు.
ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. పోలీస్ అధికారి చర్యలను పలువురు ప్రశంసిస్తున్నారు. దేశంలో పచ్చని చెట్ల శాతం క్రమక్రమంగా తగ్గిపోతోందని.. అందువల్ల వాతావరణంలో సమతుల్యత దెబ్బతింటోందని పేర్కొంటున్నారు. దీనివల్లే సరైన సమయంలో వర్షాలు కురవడం లేదని చెబుతున్నారు. అయితే ఇలాంటి అధికారులు ఉండడంల్ల చెట్లు రక్షింపబడుతున్నాయని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించారు. వేలాది మంది లైక్ చేశారు.