ఏడాది తర్వాత ఇంటికి వచ్చి.. వంటగది కబోర్డ్ తెచిరి చూడగా..
ABN , Publish Date - Oct 02 , 2026 | 10:05 AM
ఇంటికి తాళం వేసి నెలల తరబడి బయట ఉంటే.. తిరిగొచ్చేసరికి ఇల్లు ఎలా ఉంటుందో ఊహించగలరా? కానీ ఓ వ్యక్తి తన ఇంట్లోని వంటగది క్యాబినెట్ తెరిచిన తర్వాత కనిపించిన దృశ్యం మాత్రం ఊహకు కూడా అందదు. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: ఇంటికి తాళం వేసి నెలల తరబడి బయట ఉంటే.. తిరిగొచ్చేసరికి ఇల్లు ఎలా ఉంటుందో ఊహించగలరా? కానీ ఓ వ్యక్తి ఏడాది తర్వాత తన ఇంట్లోని వంటగది కబోర్డ్ తెరిచిన తర్వాత కనిపించిన దృశ్యం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. క్యాబినెట్‌లోని చెక్క భాగాలు కనిపించకుండా.. వాటి స్థానంలో మట్టి గోడలు, స్తంభాల్లాంటి నిర్మాణాలు ఏర్పడ్డాయి. లోపల వేలాది చెదపురుగులు సంచరిస్తూ ఉండటంతో.. ఆ ప్రాంతమంతా ఓ చిన్న చెదల సామ్రాజ్యంలా మారిపోయింది. తేమ, చీకటిని ఆసరాగా చేసుకున్న చెదలు.. కబోర్డ్‌ను పూర్తిగా ఆక్రమించినట్లు వీడియోలో కనిపిస్తోంది.
ఈ వీడియో ‘smash.pest.control’ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేశారు. చెదలతో నిండిపోయిన కబోర్డ్‌ను శుభ్రం చేసేందుకు పెస్ట్ కంట్రోల్ సిబ్బంది స్ప్రేలు.. రసాయనాలను ఉపయోగిస్తూ చర్యలు చేపట్టిన దృశ్యాలు కూడా వీడియోలో ఉన్నాయి. ఇప్పటికే ఈ వీడియోకు లక్షలాది వ్యూస్, 88 వేలకుపైగా లైక్స్ వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘ఇది హర్రర్ సినిమాను తలపించేలా ఉంది’ అని, ‘ఇంకో ఏడాది గడిచి ఉంటే.. ఇల్లు మొత్తం ఇదే పరిస్థితి అయి ఉండేది’ అని ఒకరు కామెంట్ చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
ఓపెన్ ఏఐలో సమాచార దుర్వినియోగం.. ముగ్గురిపై వేటు
కొత్త మొబైల్ రీచార్జ్ రూల్స్.. మీకు ఈ విషయాలు తెలుసా..