Share News

ఏనుగుల వేషంలో టీచర్లు.. పిల్లల కోసం అదిరిపోయే స్కిట్.. వీడియో వైరల్

ABN , Publish Date - Nov 17 , 2026 | 05:32 PM

బాలల దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు వినూత్న రీతిలో సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఏనుగు మాస్కులు ధరించి 'ఏక్ మోటా హాథీ' అనే ప్రముఖ గీతానికి ముచ్చటైన స్కిట్ ప్రదర్శించారు.

ఏనుగుల వేషంలో టీచర్లు.. పిల్లల కోసం అదిరిపోయే స్కిట్.. వీడియో వైరల్
Teachers Elephant Costume

ఇంటర్నెట్ డెస్క్: బాలల దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు వినూత్న రీతిలో సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఏనుగుల వేషధారణలో కనిపించి చిన్నారులను ఆశ్చర్యపరిచారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఉన్న సెయింట్ ఆండ్రూస్ పాఠశాలలో ఈ ముచ్చటైన ఘటన చోటుచేసుకుంది.

బాలల దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉపాధ్యాయులు ఏనుగు మాస్కులు ధరించి 'ఏక్ మోటా హాథీ' అనే ప్రముఖ బాలల గీతానికి సరదా స్కిట్ ప్రదర్శించారు. పాఠశాల ప్రాంగణంలో ఉపాధ్యాయులు ఒకచోట చేరి ఈ ప్రదర్శన ఇవ్వగా.. విద్యార్థులు వారి చుట్టూ కూర్చుని ఆసక్తిగా వీక్షించారు. టీచర్లు ఏనుగుల్లా నటిస్తూ పాటకు అనుగుణంగా ప్రదర్శన ఇవ్వడంతో పిల్లలు కేరింతలు కొడుతూ ఆనందంగా గడిపారు. సాధారణంగా తరగతి గదుల్లో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు ఇలా తమ కోసం ప్రత్యేకంగా ప్రదర్శన ఇవ్వడంతో విద్యార్థుల ముఖాల్లో చిరునవ్వులు విరిశాయి.


ఈ ముచ్చటైన వీడియోను ఉపాధ్యాయుల్లో ఒకరు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు టీచర్ల వినూత్న ఆలోచనను అభినందిస్తున్నారు. పిల్లల కోసం ఉపాధ్యాయులు ఎంతో సమయం కేటాయించి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమని కామెంట్స్ చేస్తున్నారు. ‘ఉపాధ్యాయులు పిల్లల కోసం చాలా చేస్తున్నారు’ అంటూ ఓ యూజర్ స్పందించగా.. మరొకరు ఈ ప్రదర్శన అద్భుతంగా ఉందని, ఇంతకుముందు ఇలాంటి కార్యక్రమాన్ని చూడలేదని పేర్కొన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

వీఐపీల కోసం సింహాన్ని బైక్‌లతో తరిమిన పార్క్ సిబ్బంది.. వీడియో వైరల్

జంగిల్ సఫారీలో పర్యాటకులకు షాక్.. దూసుకొచ్చిన పెద్దపులి!

Updated Date - Nov 17 , 2026 | 05:47 PM