Share News

తల్లికి అదిరిపోయే గిఫ్ట్.. కారును కరెన్సీ నోట్లతో ఎలా అలంకరించాడో చూడండి..

ABN , Publish Date - May 03 , 2026 | 02:08 PM

హరియాణాలోని జింద్ జిల్లాలో ఒక యువకుడు తన తల్లికి అదిరిపోయే గిఫ్ట్ అందించాడు. ఆ మహిళ రిటైర్మెంట్ రోజున కొడుకు ఇచ్చిన గిఫ్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జింద్‌కు చెందిన షాన్ దేవి అనే మహిళ హెల్త్ వర్కర్‌గా పనిచేసి రిటైర్ అయింది.

తల్లికి అదిరిపోయే గిఫ్ట్.. కారును కరెన్సీ నోట్లతో ఎలా అలంకరించాడో చూడండి..
retirement gift viral

హరియాణాలోని జింద్ జిల్లాలో ఒక యువకుడు తన తల్లికి అదిరిపోయే గిఫ్ట్ అందించాడు. ఆ మహిళ రిటైర్మెంట్ రోజున కొడుకు ఇచ్చిన గిఫ్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జింద్‌కు చెందిన షాన్ దేవి అనే మహిళ హెల్త్ వర్కర్‌గా పనిచేసి రిటైర్ అయింది. ఆమె సేవలకు గౌరవంగా, జీవితాంతం గుర్తుండిపోయేలా ఓ ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలని కుమారుడు ప్లాన్ చేశాడు (Car decorated with currency notes).


తల్లి కోసం ఓ కారు కొనుగోలు చేశాడు. అయితే ఆ కారును పూలతో కాకుండా కరెన్సీ నోట్లతో డెకరేట్ చేశాడు. కారును పది రూపాయల నోట్లతో అలంకరించాడు. డ్రైవర్ ముందు అద్దం, విండోలు తప్ప మిగతా కారు అంతటినీ కరెన్సీ నోట్లతో కప్పేశాడు. మధ్యలో తల్లి ఫొటో పెట్టాడు. షాన్ దేవి హెల్త్ సెంటర్ నుంచి బయటకు రాగానే ఆమెకు ఘనంగా స్వాగతం పలికాడు. దీంతో ఆమె ఎంతగానో ఆనంద పడింది (Son gift to mother).

car2.jpg


'నా కొడుకు, కోడలు ఇచ్చిన ఈ ఆశ్చర్యకరమైన బహుమతి నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది (Unique retirement surprise). 39 ఏళ్ల ఉద్యోగ జీవితానికి ఇంతకంటే గొప్ప వీడ్కోలు ఇంకేముంటుంది?' అని షాన్ దేవి పేర్కొంది. ఈ విలక్షణమైన వీడ్కోలు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కొందరు దీనిని 'హర్యానా స్వాగ్' అని అభివర్ణిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..


డచ్ యువరాణుల హత్యలకు కుట్ర.. బయటపడిన నాజీ తరహా ప్లాన్..

Updated Date - May 03 , 2026 | 03:07 PM