Share News

సాఫ్ట్‌వేర్ రంగంలో 18 ఏళ్ల అనుభవం.. ఏఐ దెబ్బకు జీవితం తారుమారు..

ABN , Publish Date - May 03 , 2026 | 01:21 PM

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) శరవేగంగా ఎదుగుతోంది. టెక్నాలజీ రంగంలో భారీ మార్పులు తీసుకొస్తోంది. ఈ మార్పులు ఉద్యోగాలపై ఎలా ప్రభావం చూపుతున్నాయో తెలిపే ఒక సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

సాఫ్ట్‌వేర్ రంగంలో 18 ఏళ్ల అనుభవం.. ఏఐ దెబ్బకు జీవితం తారుమారు..
software engineer layoff story

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) శరవేగంగా ఎదుగుతోంది. టెక్నాలజీ రంగంలో భారీ మార్పులు తీసుకొస్తోంది. ఈ మార్పులు ఉద్యోగాలపై ఎలా ప్రభావం చూపుతున్నాయో తెలిపే ఒక సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దాదాపు 18 ఏళ్ల అనుభవం ఉన్న ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ఏఐ కారణంగా తన ఉద్యోగం కోల్పోయి మెక్‌డోనాల్డ్స్‌లో పని చేస్తున్నాడు. ఆ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు (Software engineer layoff story).


ఏఐ కారణంగా తాను ఉద్యోగం కోల్పోయానని ఆ వ్యక్తి తెలిపాడు. అతడు 18 సంవత్సరాలు సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేశాడు. అతడు పని చేసిన కంపెనీ 12 మంది ఇంజినీర్ల బృందం స్థానంలో కేవలం ఇద్దరు ఏఐ నిపుణులను నియమించుకుని పని జరిపిస్తోందని వెల్లడించాడు. అప్పటి నుంచి తాను 100కి పైగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఎక్కడా అవకాశం రాలేదని తెలిపాడు. చివరకు కుటుంబ పోషణ కోసం మెక్‌డోనాల్డ్స్‌లో చేరినట్టు తెలిపాడు (Tech layoffs 2026).


ఇది తన కథ మాత్రమే కాదని, తనకు తెలిసిన అనేక మంది డెవలపర్లు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారని అతను తెలిపాడు (McDonald’s employee former engineer). కొందరు ఇతర రంగాల్లో ఉద్యోగాలు చేసుకుంటుండగా, మరికొందరు ఇంకా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారని పేర్కొన్నాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది అతడి పరిస్థతిపై జాలి పడ్డారు. మారుతున్న కాలానికి అనుగుణంగా స్కిల్స్ పెంచుకోవాలని మరికొందరు సూచించారు.


ఇవి కూడా చదవండి..

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..


డచ్ యువరాణుల హత్యలకు కుట్ర.. బయటపడిన నాజీ తరహా ప్లాన్..

Updated Date - May 03 , 2026 | 01:50 PM