Share News

హైవేపై కారును ఈడ్చుకెళ్లిన ట్రక్కు.. షాకింగ్ వీడియో వైరల్

ABN , Publish Date - Mar 01 , 2026 | 07:46 PM

అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ప్రాణాలకు ప్రమాదం అని అధికారులు ఎంతగా చెబుతున్నా.. కొంతమంది డ్రైవర్లు పట్టించుకోవడం లేదు. ఒక ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ కారును కొంత దూరం ఈడ్చుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..

హైవేపై కారును ఈడ్చుకెళ్లిన ట్రక్కు.. షాకింగ్ వీడియో వైరల్
Truck Drags Car Viral Video

ఇంటర్నెట్ డెస్క్: అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ప్రాణాలకు ప్రమాదం అని అధికారులు ఎంతగా చెబుతున్నా.. కొంతమంది డ్రైవర్లు పట్టించుకోవడం లేదు. ఒక ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ కారును కొంత దూరం ఈడ్చుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆదివారం బజేరా గ్రామ సమీపంలోని దబ్రా-గ్వాలియర్ హైవేపై వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొన్న తర్వాత కారును దాదాపు 1.5 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. అదృష్టం కొద్ది అందులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు ట్రక్కును వెంబడించి డ్రైవర్‌ని పట్టుకొని చితక్కొట్టారు. అనంతరం పోలీసు స్టేషన్‌లో అప్పగించారు.


దబ్రా-గ్వాలియర్ హైవేపై వేగంగా వస్తున్న ట్రక్కు కారును ఢీకొన్న తర్వాత, కారు ట్రక్కు ముందు భాగంలో ఇరుక్కుపోయింది. వెంటనే ట్రక్కు డ్రైవర్ ఆపడానికి బదులుగా అలాగే ముందుకు నడుపుకుంటూ వెళ్లాడు. కారులో ఉన్నవారు అరుస్తూ, ట్రక్కు డ్రైవర్ ను ఆపమని వేడుకున్నప్పటికీ, అతను స్పందించలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్థానిక నివాసి తన బైక్ పై ట్రక్కును వెంబడించి, డ్రైవర్ ను ఆపమని అరిచినా పట్టించుకోలేదని అన్నారు. 1.5 కిలోమీటర్ల వరకు కారును ఈడ్చుకెళ్లి, రోడ్డు పక్కన ఉన్న గుంట వైపునకు తోసి పారిపోవడానికి ప్రయత్నించారని ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు. ఇది‌లా ఉంటే.. తమకు అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు రాలేదని అంత్రి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గీతేష్ శర్మ తెలిపారు. దర్యాప్తు కోసం ట్రక్కును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి..

ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలిరేజా అరాఫీ

ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడి.. శనివారం ఉదయమే ఎందుకు చేశారు?

Updated Date - Mar 01 , 2026 | 07:58 PM