నడిరోడ్డుపై షాకింగ్ సీన్.. పెద్ద ప్లానింగే.. వీడియో వైరల్
ABN , Publish Date - Jul 17 , 2026 | 03:46 PM
సోషల్ మీడియా వేదికగా రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని వినోదాత్మకంగా ఉంటే.. మరికొన్ని భయం కలిగించేలా ఉంటాయి. ప్రస్తుతం ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా వేదికగా రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని వినోదాత్మకంగా ఉంటే.. మరికొన్ని భయం కలిగించేలా ఉంటాయి. ప్రస్తుతం ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చివర వరకూ చూస్తే.. అసలు ఏం జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఓ వ్యక్తి నిర్మానుష్యమైన రోడ్డుపై కదలకుండా పడి ఉన్నాడు. మరో యువకుడు.. ఆ వ్యక్తి కాలు పట్టుకుని ఈడ్చుకు వెళ్తున్నాడు. అతడి చేతిలో కర్ర కూడా ఉంది. ఆ కర్రతో దాడి చేయడంతో ఆ వ్యక్తి చనిపోయినట్లుగా ఆ సీన్ ఉంది. దీనిని చూస్తే ఘోరమైన నేరం జరిగినట్లుగా అనిపిస్తుంది. అంతలో బైక్‌పై వచ్చిన వ్యక్తి.. ఎదురుగా ఉన్న వ్యక్తి చేతిలో కర్ర.. మరో చేతిలో వ్యక్తి కాలు ఉండటాన్ని చూసి భయంతో ఆగిపోయాడు.
కర్రను నేలకేసి కొట్టాడు. వ్యక్తి కాలు వదిలి.. వేగంగా బైక్ వద్దకు పరుగు తీశాడు. దీంతో బైక్‌పై వచ్చిన వ్యక్తి.. భయంతో దానిని వదిలి పారిపోయాడు. కర్ర వదిలిన వ్యక్తి ఆ బైక్‌పై ఎక్కేశాడు. అంతే వేగంతో రహదారిపై పడిపోయిన వ్యక్తి లేచి.. ఆ బైక్‌పై ఎక్కి వెనుక కూర్చున్నాడు. వీరిద్దరు బైక్‌పై వెళ్లిపోయారు. అయితే ఇదంతా ముందుగా వేసిన స్కెచ్ ప్రకారం జరిగినట్లుగా ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలు నేరస్థులు కొత్త పద్ధతులు అవలంభించడానికి ఉపయోగపడుతుందని ఆందోళన చెందారు. ఈ తరహా వీడియోలు సమాజంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తాయని తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు స్పష్టం చేశారు.