Share News

8 రోజులుగా నిద్రలేక ఇబ్బంది.. అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మహిళ ఏం చేసిందంటే!

ABN , Publish Date - Nov 19 , 2026 | 04:22 PM

సాధారణంగా దొంగతనాలు, గొడవలు, ఇతర సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ప్రజలు పోలీస్ స్టేషన్‌కు వెళ్తుంటారు. కానీ మధ్యప్రదేశ్‌లో ఓ మహిళ వింత సమస్యతో అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది.

8 రోజులుగా నిద్రలేక ఇబ్బంది.. అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మహిళ ఏం చేసిందంటే!
Sleeplessness

ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. గత 8 నుంచి 10 రోజులుగా నిద్ర పట్టడం లేదంటూ ఓ మహిళ అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో స్టేషన్‌లోకి వచ్చిన ఆమె.. వెంటనే తన ఫిర్యాదును నమోదు చేయాలని పోలీసులను కోరింది. సాధారణంగా దొంగతనాలు, గొడవలు, ఇతర సమస్యలపై ఫిర్యాదులు అందుకునే పోలీసులకు మహిళ చెప్పిన విషయం ఆశ్చర్యం కలిగించింది. గత కొన్ని రోజులుగా కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నానని.. నిద్రలేమి కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని ఆమె తన ఆవేదనను అధికారులకు వివరించింది.


తన సమస్యపై ఇప్పటికే 108 హెల్ప్‌లైన్‌తో పాటు ఇతర మార్గాల్లోనూ ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ఉపశమనం లభించలేదని మహిళ తెలిపింది. దీంతో అర్ధరాత్రి వేళ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి తనకు సహాయం చేయాలని కోరింది. అధికారులతో మాట్లాడుతున్న సమయంలో ఆమె తీవ్ర అసహనం.. ఆవేదనకు గురైనట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళ పరిస్థితిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. రోజులు తరబడి నిద్రలేకపోవడం సాధారణ విషయం కాదని, ఆమెకు తగిన వైద్య సహాయం అందించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

వీఐపీల కోసం సింహాన్ని బైక్‌లతో తరిమిన పార్క్ సిబ్బంది.. వీడియో వైరల్

జంగిల్ సఫారీలో పర్యాటకులకు షాక్.. దూసుకొచ్చిన పెద్దపులి!

Updated Date - Nov 19 , 2026 | 05:10 PM