భర్తతో గొడవపడి బావిలోకి దూకిన భార్య.. చివరకు ఏం జరిగిందంటే!
ABN , Publish Date - Oct 18 , 2026 | 07:52 AM
భార్యాభర్తల మధ్య చిన్న వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. భర్తతో గొడవపడిన భార్య ఆవేశంతో లోతైన బావిలోకి దూకింది. ఆమెను కాపాడేందుకు భర్త ఎంత ప్రయత్నించినా బయటకు రావడానికి నిరాకరించింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లా దినారా పోలీస్స్టేషన్ పరిధిలోని సహరియా గ్రామంలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ తీవ్ర కలకలం రేపింది. ఇంటి తలుపునకు తాళం వేయడంపై భర్తతో వాగ్వాదం జరగడంతో ఆగ్రహానికి గురైన భార్య సమీపంలోని లోతైన బావిలోకి దూకినట్లు సమాచారం.
ఆమెను రక్షించేందుకు భర్త బావిలోకి తాడు వేయగా.. దానిని పట్టుకున్న మహిళ బయటకు రావడానికి నిరాకరించింది. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు బావిలో నుంచి బయటకు రావాలంటే గ్రామస్తులందరి ముందు తన భర్త క్షమాపణ చెప్పాలని ఆమె షరతు విధించింది.
భార్యను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి కుటుంబ సభ్యులు.. గ్రామస్థులు ప్రయత్నాలు కొనసాగించారు. ఆమె పట్టుదల వీడకపోవడంతో చివరకు భర్త అందరి ముందు చేతులు జోడించి క్షమాపణ చెప్పినట్లు కథనాలు వెల్లడించాయి. అనంతరం ఆమె బయటకు వచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే.. ఈ విషయంపై ఇప్పటివరకూ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని దినారా పోలీస్స్టేషన్ ఇన్చార్జ్ తెలిపినట్లు వార్తలు పేర్కొన్నాయి. చిన్నచిన్న కుటుంబ వివాదాలు ప్రాణాలకు ముప్పు కలిగించే పరిస్థితులకు దారితీయకుండా, భార్యాభర్తలు సంయమనం పాటిస్తూ సమస్యలను పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఈ ఘటన గుర్తుచేస్తోంది.
ఈ వార్తలూ చదవండి
రైతులకు మహారాష్ట్ర ఐఏఎస్, ఐపీఎస్ల అండ.. సహాయనిధికి ఒక్కరోజు జీతం.
‘ఫుట్పాత్ ఏర్పాటు చేయకపోతే ధర్నాకు దిగుతాం’.. సుప్రీంకోర్టు హెచ్చరిక