Share News

ఏటీఎంకు డబ్బుల కోసం వెళ్లిన వారికి షాక్.. లోపల సీన్ చూస్తే..

ABN , Publish Date - May 11 , 2026 | 07:12 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు, ఫొటోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.

ఏటీఎంకు డబ్బుల కోసం వెళ్లిన వారికి షాక్.. లోపల సీన్ చూస్తే..
SBI ATM salon viral video

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు, ఫొటోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా బీహార్‌లోని దానాపూర్ ప్రాంతానికి చెందిన ఓ ఏటీఎం పరిస్థితి చాలా మందికి నవ్వు తెప్పిస్తోంది (SBI ATM salon viral video).


దానాపూర్‌లోని ఒక చోట ఎస్బీఐ ఏటీఎం సెంటర్ కనబడుతోంది. అయితే డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం కోసం ఎవరైనా వెళితే షాకవక తప్పదు. ఎందుకంటే లోపల ఏటీఎం మెషిన్ లేదు. లోపల హెయిర్ కటింగ్ చేస్తున్నారు. బయటి నుంచి చూస్తే, అది పూర్తిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలాగే కనిపిస్తోంది. ఎవరికీ ఎటువంటి అనుమానమూ కలగదు. కానీ, లోపల ఏటీఎం మెషీన్‌కు బదులుగా సెలూన్ కుర్చీలు, అద్దాలు, హెయిర్‌ కటింగ్ పరికరాలు కనిపిస్తున్నాయి (Bihar SBI ATM).


అసలు విషయమేమిటంటే.. అక్కడ కొన్ని సంవత్సరాలుగా ఎస్బీఐ ఏటీఎమ్ ఉంది (SBI ATM hair salon). ఇటీవల దానిని తొలగించారు. కానీ, బయట ఉన్న బోర్డ్‌ను మాత్రం తీయలేదు. ఆ ఖాళీ స్థలంలో ఒక వ్యక్తి సెలూన్ ప్రారంభించాడు. అతడు కూడా ఆ బయటి బోర్డ్‌ను తీయలేదు. దీంతో డబ్బుల కోసం అక్కడకు వెళ్లిన వారు షాకవుతున్నారు. ఈ సెలూన్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.


ఇవి కూడా చదవండి..

విజయ్ ప్రమాణ స్వీకారంలో ముందుగా వందేమాతరం.. ప్రతిపక్షాల ఆగ్రహం..


పాక్ ఆర్మీ చీఫ్ చెప్పినవన్నీ అబద్దాలే.. బయటపడిన అసలు నిజం..

Updated Date - May 11 , 2026 | 07:13 PM