ఎంజీనరేగా స్థానంలో 'వీబీ జీ రామ్ జీ'.. జులై 1 నుంచి అమల్లోకి..
ABN , Publish Date - May 11 , 2026 | 05:56 PM
కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి రంగంలో భారీ మార్పునకు శ్రీకారం చుట్టింది. గత రెండు దశాబ్దాలుగా అమల్లో ఉన్న 'మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం'ను రద్దు చేసి, దాని స్థానంలో కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురానుంది.
కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి రంగంలో భారీ మార్పునకు శ్రీకారం చుట్టింది. గత రెండు దశాబ్దాలుగా అమల్లో ఉన్న 'మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం' (MGNREGA)ను రద్దు చేసి దాని స్థానంలో 'వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్' (VB-G RAM G Act) ను అమల్లోకి తీసుకురానుంది. ఈ కొత్త చట్టం 2026, జులై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది (MGNREGA replaced).
ఈ కొత్త చట్టం ద్వారా గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి 125 రోజుల ఉపాధి హామీ దొరకనుంది. ప్రస్తుతం ఎంజీనరేగా ద్వారా 100 రోజుల ఉపాధి మాత్రమే లభిస్తోంది. గ్రామీణ కార్మికులకు ఉపాధి అవకాశాలను మరింత పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. 2005 నుంచి అమల్లో ఉన్న ఎంజీనరేగా పథకాన్ని అధికారికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎంజీనరేగా నుంచి కొత్త చట్టంలోకి మార్పు సజావుగా జరుగుతుందని, కార్మికులకు ఎలాంటి అంతరాయమూ కలగదని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చింది (Rural employment scheme).
జూన్ 30, 2026 నాటికి ఎంజీనరేగా కింద కొనసాగుతున్న అన్ని ప్రాజెక్టులూ ఈ కొత్త వ్యవస్థ కింద యధావిధిగా కొనసాగుతాయని తెలిపింది (India rural development). కొత్త గ్రామీణ రోజ్‌గార్ గ్యారంటీ కార్డులు జారీ అయ్యేంత వరకు, ప్రస్తుతం ఉన్న ఇ-కేవైసీ జాబ్ కార్డులే చెల్లుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. ముఖ్యంగా, కార్మికుల ఇ-కేవైసి ప్రక్రియ పెండింగ్‌లో ఉన్నప్పటికీ వారికి ఉపాధి లభిస్తుందని, జాబ్ కార్డులు లేని కొత్త కార్మికులు గ్రామ పంచాయతీలో నమోదు చేసుకోవాలని సూచించింది.
ఇవి కూడా చదవండి..
విజయ్ ప్రమాణ స్వీకారంలో ముందుగా వందేమాతరం.. ప్రతిపక్షాల ఆగ్రహం..
పాక్ ఆర్మీ చీఫ్ చెప్పినవన్నీ అబద్దాలే.. బయటపడిన అసలు నిజం..