Share News

విజయ్ ప్రమాణ స్వీకారంలో ముందుగా వందేమాతరం.. ప్రతిపక్షాల ఆగ్రహం..

ABN , Publish Date - May 11 , 2026 | 03:23 PM

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే రాజకీయ వివాదం చెలరేగింది. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో తమిళ తల్లి గీతం 'తమిళ్ తాయ్ వాళుత్తు'కు ప్రాధాన్యం తగ్గించారని ప్రతిపక్షాలు, సామాజిక వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.

విజయ్ ప్రమాణ స్వీకారంలో ముందుగా వందేమాతరం.. ప్రతిపక్షాల ఆగ్రహం..
Vijay oath ceremony

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే రాజకీయ వివాదం చెలరేగింది. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో తమిళ తల్లి గీతం 'తమిళ్ తాయ్ వాళుత్తు'కు ప్రాధాన్యం తగ్గించారని ప్రతిపక్షాలు, సామాజిక వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. పాటలను ఆలపించిన క్రమంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం. వీరపాండియన్ విమర్శలు చేశారు (Vijay oath ceremony).


విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మొదట 'వందేమాతరం', ఆ తర్వాత జాతీయ గీతం 'జన గణ మన', చివరగా 'తమిళ్ తాయ్ వాళుత్తు' పాటను వినిపించారు. సాధారణంగా ఎన్నో ఏళ్లుగా తమిళనాడు ప్రభుత్వ కార్యక్రమాలు 'తమిళ్ తాయ్ వాళుత్తు'తో ప్రారంభమై, జాతీయ గీతం 'జన గణ మన'తో ముగుస్తాయి. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఈ క్రమం మారడంతో వివాదం మొదలైంది. తమిళ గౌరవాన్ని ప్రతిబింబించే 'తమిళ్ తాయ్ వాళుత్తు'కి ప్రభుత్వ కార్యక్రమాల్లో మొదటి స్థానం ఉండాలని వీరపాండియన్ అన్నారు (Vande Mataram controversy).


తమిళ తల్లి గీతానికి ప్రాధాన్యం తగ్గించడంపై టీవీకే పార్టీ ప్రధాన కార్యదర్శి ఆథవ్ అర్జున కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు (Tamil Thaai Vaazhthu row). కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం గవర్నర్ కార్యాలయం ఇలా మార్చిందని, ఇది సరికాదని అన్నారు. ఈ కొత్త పద్ధతి తమిళనాడుకు తగనిదని, తమ ప్రభుత్వ కార్యక్రమాల్లో ముందుగా తమిళ తల్లి గీతమే వినిపిస్తుందని చెప్పారు.


ఈ వార్తనూ చదవండి:

ఇజ్రాయెల్‌కు షాకిచ్చిన హెజ్‌బొల్లా.. ఐరన్ డోమ్ యూనిట్ ధ్వంసం

భారత్‌కు పాక్ ఆర్మీ చీఫ్ వార్నింగ్

Updated Date - May 11 , 2026 | 03:27 PM