మాజీ సీఎం స్టాలిన్‌ను కలిసిన విజయ్.. తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ..
ABN , Publish Date - May 11 , 2026 | 04:15 PM
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ కొత్త సాంప్రదాయానికి తెర తీశారు. మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఇంటికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. కొద్ది నిమిషాల పాటు స్టాలిన్‌తో విజయ్ భేటీ కావడం తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఓ కొత్త సాంప్రదాయానికి తెర తీశారు. మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఇంటికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. కొద్ది నిమిషాల పాటు స్టాలిన్‌తో విజయ్ భేటీ కావడం తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ ఏమి మాట్లాడుకున్నారనే విషయం బయటకు రాలేదు (Vijay MK Stalin meeting).
గత ఐదేళ్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేసిన స్టాలిన్ తాజా ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ఎన్నికల్లో టీవీకే అత్యధిక స్థానాలు సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలం టీవీకేకు దక్కలేదు. దీంతో డీఎంకే మిత్ర పక్షాలైన కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే తదితర పార్టీలు, టీవీకేకు మద్దతు ప్రకటించడంతో విజయ్ సీఎం కాగలిగారు (Tamil Nadu CM Vijay).
ఈ నేపథ్యంలో స్టాలిన్‌ను విజయ్ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది (TVK victory). ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమే అని టీవీకే ప్రతినిధులు వెల్లడించారు. అయితే స్టాలిన్ చొరవతోనే విజయ్‌కు డీఎంకే మిత్రపక్షాలు మద్దతు ప్రకటించాయని వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా స్టాలిన్ ఇంటికి విజయ్ వెళ్లడం మాత్రం తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది.
ఇవి కూడా చదవండి..
విజయ్ ప్రమాణ స్వీకారంలో ముందుగా వందేమాతరం.. ప్రతిపక్షాల ఆగ్రహం..
పాక్ ఆర్మీ చీఫ్ చెప్పినవన్నీ అబద్దాలే.. బయటపడిన అసలు నిజం..