Share News

గ్రామీణ పిల్లల 'కారు'కు సచిన్ ఫిదా.. వీడియో వైరల్

ABN , Publish Date - May 13 , 2026 | 07:47 AM

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కేవలం మైదానంలోనే కాదు, సామాన్యులలో దాగి ఉన్న అసాధారణ ప్రతిభను గుర్తించడంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటారు. వివరాల్లోకి వెళితే..

గ్రామీణ పిల్లల 'కారు'కు సచిన్ ఫిదా.. వీడియో వైరల్
Sachin Tendulkar Viral Video

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కేవలం మైదానంలోనే కాదు, సామాన్యులలో దాగి ఉన్న అసాధారణ ప్రతిభను గుర్తించడంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటారు. ఇటీవల ఆయన ఒక మారుమూల గ్రామీణ ప్రాంతం గుండా ప్రయాణిస్తున్నప్పుడు, అక్కడి పిల్లల సృజనాత్మకత చూసి ఆశ్చర్యపోయారు. ఎటువంటి ఆధునిక సాంకేతికత అందుబాటులో లేని చోట, కేవలం తమ క్రియేటివిటీతో ఆ పిల్లలు సృష్టించిన ఒక 'ఇంజనీరింగ్ అద్భుతం' సచిన్‌ను ఎంతో ఆకర్షించింది. కోట్లు పెట్టినా దొరకని ఐడియా అంటూ పిల్లల్ని మెచ్చుకున్నారు.


రోడ్డు పక్కన ఇద్దరు పిల్లలు రెండు కర్రలకు చక్రాలను అమర్చి, దానిని ఒక వాహనంలా నెట్టుకుంటూ వెళ్లడాన్ని సచిన్ గమనించారు. వెంటనే తన ప్రయాణాన్ని ఆపి ఆ పిల్లల వద్దకు వెళ్లారు. వారితో ముచ్చటించి, వారి వినూత్న ఆలోచనను మెచ్చుకుంటూ స్వయంగా వీడియో తీశారు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని సచిన్ తన ఎక్స్‌ (X) అకౌంట్‌లో అభిమానులతో పంచుకున్నారు. ‘వీరి ప్రతిభకు ఒక చిన్న అవకాశం మాత్రమే కావాలి’ అంటూ సచిన్ తన పోస్టులో రాసుకొచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి:

సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. అంబరాన్ని అంటిన సంబరాలు..

ఎలుకల నుంచి మనుషులకు హంటా వైరస్..

Read Latest Telangana News and National News

Updated Date - May 13 , 2026 | 01:28 PM