పాపరాజీతో ఫొటో దిగిన రిహన్నా.. వీడియో వైరల్..
ABN , Publish Date - Apr 25 , 2026 | 01:08 PM
ముంబైలో ఓ ప్రత్యేకమైన కార్యక్రమానికి హాజరయ్యేందుకు భారతదేశానికి ఇటీవల వచ్చిన గ్లోబల్ ఐకాన్ రిహన్నా మరోసారి వార్తల్లో నిలిచారు. తన ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించారు.
మహారాష్ట్ర: ముంబైలో ఓ ప్రత్యేకమైన కార్యక్రమానికి హాజరయ్యేందుకు భారతదేశానికి ఇటీవల వచ్చిన గ్లోబల్ ఐకాన్ రిహన్నా మరోసారి వార్తల్లో నిలిచారు. తన ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె.. అక్కడ ఉన్న పాపరాజీలను ఆప్యాయంగా పలకరించారు. వారిలో ఒకరిని పిలిచి.. దగ్గరకు తీసుకుని మరీ ఫొటోలకు ఫోజులిచ్చారు.
అనంతరం వారిద్దరూ సరదాగా నవ్వేశారు. అంతర్జాతీయ స్థాయి స్టార్‌తో ఫొటోలు దిగడంపై యువకుడు సంతోషం వ్యక్తం చేశాడు. ఈ కార్యక్రమంలో నల్ల దుస్తుల్లో రిహన్నా ఆకట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరో వీడియోలోనూ రిహానా హిందీలో ధన్యవాదాలు తెలిపారు. థాంక్స్ ఎలా చెప్పాలని అక్కడున్న కెమెరామెన్‌ని అడగ్గా 'శుక్రియా' అంటూ బదులిచ్చాడు. అనంతరం అక్కడున్న వారందరికీ ఆమె శుక్రియా అని చెప్పగా అభిమానులు కేరింతలు కొట్టారు.
రిహన్నా ప్రవర్తనపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురుస్తున్నాయి. అందరితోనూ ఆమె ఎంతో దయగా ఉంటారని కొనియాడుతున్నారు. గతంలో ఆమె భారతదేశానికి వచ్చినప్పుడు విమానాశ్రయ సిబ్బందితోనూ ఫొటోలు దిగారని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. రిహన్నా చాలా దయగల వారని, ఏ భారతీయ సెలబ్రిటీ కూడా సామాన్యులతో ఆమెలా ఎప్పటికీ చేయలేరని మరో నెటిజన్ స్పందించాడు. భారతదేశానికి రిహన్నా రావడం ఇది రెండోసారి. గతంలో జామ్‌నగర్ వేదికగా జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహ వేడుకల ప్రదర్శన కోసం ఆమె భారత్‌కు వచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
అదృష్టవంతుడు అంటే ఇతనే.. క్షణాల్లో ప్రాణాలు కాపాడుకున్నాడు..
పాత నోట్లు vs కొత్త నోట్లు.. ఈ ఆసక్తికర వీడియో చూశారా?