అదృష్టవంతుడు అంటే ఇతనే.. క్షణాల్లో ప్రాణాలు కాపాడుకున్నాడు..
ABN , Publish Date - Apr 25 , 2026 | 07:39 AM
ఓ వ్యక్తి క్షణాల వ్యవధిలో ప్రాణాలను కాపాడుకున్న వీడియో వైరల్‌గా మారింది. అది అతనికి తెలియకుండానే జరిగిపోవడంతో అదృష్టవంతుడు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రతి రోజూ చాలా మంది ఏదో ఒక రకమైన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతుంటారు. క్షణాల వ్యవధిలోనే తుది శ్వాస విడుస్తుంటారు. ప్రమాదం జరిగే స్థలానికి కొన్ని సెకన్ల ముందు లేదా తర్వాత వెళ్లుంటే వారికి ఆ దుస్థితి ఎదురవ్వదు. అలా ముందే భవిష్యత్తును ఊహించలేరు కాబట్టి ప్రమాదానికి గురవుతుంటారు. అయితే, తాజాగా ఓ వ్యక్తి క్షణాల వ్యవధిలో ప్రాణాలను కాపాడుకున్న వీడియో వైరల్‌గా మారింది. అది అతనికి తెలియకుండానే జరిగిపోవడంతో అదృష్టవంతుడు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
@ThePushprajX అనే ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి సెల్ఫ్ సర్వీస్ లాండ్రీ సౌకర్యం ఉన్న లాండ్రోమాట్‌లో ఉన్నాడు. అక్కడ తన పని పూర్తి అవడంతో బట్టలు తీసుకుని బయటకు వెళ్తున్నాడు. అతను డోర్ తీసుకుని వెళ్లిన రెండు, మూడు క్షణాల్లోనే దిగ్భ్రాంతికర ఘటన జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా లాండ్రీ మిషన్ పేలిపోయింది. ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగి షాపు మెుత్తం ధ్వంసమైంది. అక్కడ ఉన్న వస్తువులు, గ్లాస్ డోర్ ముక్కలైపోయాయి. దీంతో క్షణాల వ్యవధిలోనే ప్రమాదం నుంచి తప్పించుకుని అతను ప్రాణాలు కాపాడుకున్నాడు.
ఈ వీడియో ఎక్కడ జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకూ మూడు లక్షలకు మందికి పైగా వీక్షించారు. ప్రమాదం నుంచి తప్పించుకుని మృత్యుంజయుడు అయ్యాడని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా.. అదృష్టవంతుడు అంటే ఇతనే అంటూ మరొకరు కామెంట్ పెట్టారు. జీవితంలో సమయం ఎంతో విలువైనదని.. రెండు సెకన్లు ఆలస్యంగా బయటకు వెళ్లుంటే ప్రాణాలు పోయేవని ఇంకో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలా పలు రకాల కామెంట్ల మధ్య వీడియో వైరల్ అవుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి
భార్యను చంపి.. ఉరేసుకున్న భర్త
స్నేహితుడిని చంపేసి.. పాతిపెట్టి..