Share News

ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. క్షణాల్లో ప్రాణం పోయింది..

ABN , Publish Date - Apr 23 , 2026 | 06:36 PM

గూడ్స్ రైలు పైకి ఎక్కిన ఓ వ్యక్తి హైటెన్షన్ వైర్‌ను పట్టుకున్నాడు. వైర్‌ను పట్టుకున్న క్షణాల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన బిహార్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. క్షణాల్లో ప్రాణం పోయింది..
Darbhanga train incident

ఇంటర్‌నెట్ డెస్క్: బిహార్‌ రాష్ట్రంలో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. గూడ్స్ రైలు పైకి ఎక్కిన ఓ వ్యక్తి హైటెన్షన్ వైర్‌ను పట్టుకున్నాడు. వైర్‌ను పట్టుకున్న క్షణాల్లో ప్రాణాలు కోల్పోయాడు. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ధర్బంగలోని లహేరియాసరయ్ రైల్వే స్టేషన్ దగ్గర ఓ గూడ్స్ రైలు పట్టాలపై ఆగి ఉంది. మతిస్తిమితం సరిగా లేని వ్యక్తి గూడ్స్ రైలుపైకి ఎక్కాడు. అటు, ఇటు తిరగసాగాడు. ఇది గమనించిన ప్రయాణికులు కిందకు దిగమని అతడికి చెప్పారు. ఆ వ్యక్తి వారి మాటలు పట్టించుకోలేదు.


ఓ బోగి మీద నుంచి మరో బోగి మీదకు వెళ్లాడు. ఎడమ చెయ్యి పైకి ఎత్తి నడవ సాగాడు. ప్రయాణికులు భయపడిపోయారు. ప్రాణం పోతుందంటూ గట్టిగా అరవసాగారు. ఆ వ్యక్తి ఇదేమీ పట్టించుకోకుండా చెయ్యి పైకి ఎత్తి ఉంచాడు. ఈ నేపథ్యంలోనే అతడి వేలు పైన ఉన్న హైటెన్షన్ వైర్‌ను తగిలింది. కరెంట్ షాక్ కారణంగా అతడు క్షణాల్లో ప్రాణాలు కోల్పోయాడు. ధబ్ మని బోగిపై విగతజీవిగా పడిపోయాడు. ఈ ఘటనతో అక్కడి వారంతా షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను అక్కడున్న ఓ ప్రయాణికుడు వీడియో తీశాడు.


ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఆ వీడియో చూసి షాక్ అయ్యా. నా ఒళ్లు గగుర్పొడిచింది’..‘ఇలాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయాయి. మతిస్తిమితం లేని వారు ప్రాణాలు కోల్పోతున్నారు. రైల్వే అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

భారత్, చైనాలు నరకాలు కావు.. మానవాళికి మహోన్నత దేశాలు: ట్రంప్‌నకు ఇరాన్ కౌంటర్

కాళేశ్వరం తీర్పుపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్‌

Updated Date - Apr 23 , 2026 | 06:53 PM