Share News

పీడకలగా రాపిడో రైడ్.. సినిమా లెవెల్ ఛేజింగ్

ABN , Publish Date - Oct 07 , 2026 | 07:43 PM

బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి రోజులాగే బైక్ ట్యాక్సీ బుక్ చేసుకున్నారు. రైడర్ వస్తే ఓటీపీ చెప్పి.. వెనుక కూర్చున్నారు. అప్పుడే మొదలైంది కథ.

పీడకలగా రాపిడో రైడ్.. సినిమా లెవెల్ ఛేజింగ్
bike taxi

ఇంటర్నెట్ డెస్క్: ఓ వ్యక్తికి ఒక రాపిడో రైడ్ జీవితంలో మర్చిపోలేని పీడకలగా మారింది. బైక్ ట్యాక్సీ రైడర్ తనకు చుక్కలు చూపించాడంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ పోస్ట్ వైరలవుతోంది.


బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి రోజులాగే బైక్ ట్యాక్సీ బుక్ చేసుకున్నారు. రైడర్ వస్తే ఓటీపీ చెప్పి.. వెనుక కూర్చున్నారు. అప్పుడే మొదలైంది కథ. ఆ రైడర్ ఇష్టమొచ్చినట్టు బండి నడపడం మొదలుపెట్టాడు. రోడ్డుపై ముందు, వెనుక ఉన్న వాహనాలను చూడకుండా డ్రైవ్ చేస్తున్నాడు. అప్పుడే వెనుకున్న ప్రయాణికుడి గుండెలో దడ పుట్టింది. ‘ఏమన్నా యాక్సిడెంట్ చేస్తాడా ఏంటీ’ అని ఆయనలో భయం మొదలైంది. ఆ భయాన్ని నిజం చేశాడా రైడర్. అదుపు తప్పి ఎదురుగా వస్తున్న కారును అతడు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ప్రయాణికుడు గాయపడ్డారు.


వాహనం బరువు మొత్తం మీద పడడంతో ప్రయాణికుడి ఎడమ చీలమండకు గాయమైంది. అయితే ఈ కథ ఇక్కడితో ఆగలేదు. ఈ ఘటన తరువాత కారు డ్రైవర్ గొడవకు దిగాడు. దీంతో రైడర్ వేగంగా బండిపైకి లేపాడు. ఆ ప్రయాణికుడిని ఎక్కించుకుని పారిపోయాడు. ఆ వెనుకే కార్ బైక్‌ను వెంబడిస్తూ వస్తోంది.


సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా ఈ ఛేజింగ్ సీన్ సాగింది. కొన్నిసార్లు ఆ కార్ అత్యంత వేగంగా బైక్‌ను సమీపించేది. భయంతో వెనుక నుంచి ప్రయాణికుడు ‘ఆపండి.. ఆపండి’ అని అరిచినా రైడర్ ఆపలేదు. ఆ తరువాత ఓ వీధిలో ఆపి గాయాలతో ఉన్న ప్రయాణికుడిని వదిలి వెళ్లిపోయాడు. అనంతరం ఊపిరి పీల్చుకుని, ఈ అనుభవాన్ని ప్రయాణికుడు సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీనిపై యూజర్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు

పోస్టు కోసం ఇక్కడ క్లీక్ చేయండి


ఈ వార్తలూ చదవండి

పాదచారుడితో గొడవపడ్డ భారత సంతతి మహిళ.. చివరకు అరెస్ట్

అందరికీ అక్టోబర్ 2న గాంధీ జయంతి.. అక్కడ మాత్రం అక్టోబర్ 7న..

Updated Date - Oct 07 , 2026 | 07:58 PM