బోల్తాపడిన ఆయిల్ ట్యాంకర్.. చుక్క మిగల్చకుండా ఎత్తుకెళ్లిన జనం.
ABN , Publish Date - Oct 15 , 2026 | 03:09 PM
రాజస్థాన్‌లో ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడిన ఘటన ఆసక్తికరంగా మారింది. ట్యాంకర్ నుంచి రోడ్డుపైకి ఆవనూనె లీక్ కావడంతో స్థానికులు కుండలు, ఇతర పాత్రలతో అక్కడికి చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. థానాగాజీ ప్రాంతంలోని దేహ్రా మోడ్ సమీపంలో అల్వార్ నుంచి జైపూర్‌కు ఆవనూనెను తరలిస్తున్న ఓ ట్యాంకర్ ప్రమాదానికి గురైంది. రోడ్డుపై వెళ్తున్న ట్యాంకర్‌కు అకస్మాత్తుగా ఓ ఆవు అడ్డురావడంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ట్యాంకర్ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదం కారణంగా ట్యాంకర్లో ఉన్న ఆవనూనె రోడ్డుపైకి లీక్ కావడం ప్రారంభమైంది. సాధారణంగా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు క్షతగాత్రులకు సాయం చేయడం లేదా సహాయక చర్యల్లో పాల్గొనడం కనిపిస్తుంది. కానీ.. ఇక్కడ మాత్రం జనాలు ఎగబడి నూనెను ఎత్తుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
ట్యాంకర్ బోల్తా పడిన విషయం తెలియగానే స్థానికులు ఘటనాస్థలికి చేరుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న కుండలు, బిందెలు, ఇతర పాత్రలతో రోడ్డుపై ఒలికిపోతున్న ఆవనూనెను తీసుకెళ్లడం ప్రారంభించారు. ట్యాంకర్ చుట్టూ పెద్ద సంఖ్యలో గుమిగూడిన ప్రజలు.. తమకు వీలైనంత మేర నూనెను పాత్రల్లో నింపుకునేందుకు ప్రయత్నించారు. ఈ దృశ్యాలను అక్కడున్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి.
ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘మనుషులు ప్రమాదంలో ఉన్నా.. వాళ్లకు నూనే ముఖ్యమైంది’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ‘మనుషులు ఎంత స్వార్థంగా ఉన్నారు.. డ్రైవర్, క్లీనర్ పరిస్థితి ఏంటో?’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
ఇవీ చదవండి:
ముస్కాన్‌కు మరణశిక్ష.. పిల్లల భవితవ్యంపై సౌరభ్ కుటుంబం స్పందనిదే.?
నాల్గో టీ20లో టీమ్ఇండియా ఓటమికి ప్రధాన కారణం అతడే.!