Share News

పుదుచ్చేరిలో ట్రాఫిక్ నియంత్రణకు రోబో.. పోలీసుల వినూత్న ప్రయోగం.. వీడియో వైరల్

ABN , Publish Date - Nov 19 , 2026 | 03:20 PM

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు జరిమానాలు విధించడం సాధారణమే. కానీ ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ఓ భారీ రోబోనే రోడ్డుపైకి వస్తే ఎలా ఉంటుంది? అవును.. పుదుచ్చేరిలోని విల్లియనూర్‌లో ఇలాంటి ఆసక్తికర దృశ్యం కనిపించింది.

పుదుచ్చేరిలో ట్రాఫిక్ నియంత్రణకు రోబో.. పోలీసుల వినూత్న ప్రయోగం.. వీడియో వైరల్
Puducherry traffic

ఇంటర్నెట్ డెస్క్: ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే ప్రమాదాలు తప్పవని పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుంటారు. ట్రాఫిక్ అధికారులు ఇటీవల వాహనదారుల్లో అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే పుదుచ్చేరిలో పోలీసులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసులతో కలిసి ఓ భారీ రోబో రోడ్డుపైకి వచ్చింది. దీంతో ఈ వినూత్న దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


పుదుచ్చేరిలోని విల్లియనూర్ ప్రాంతంలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా 'పింక్ ట్రాన్స్‌ఫార్మర్' రోబోట్ కాస్ట్యూమ్‌ను ఉపయోగించారు. ట్రాఫిక్ పోలీసుతో కలిసి రోడ్డుపై నిలబడిన ఈ భారీ రోబో తన ప్రత్యేకమైన రూపంతో వాహనదారులు, పాదచారులను ఆకర్షించింది. ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ వినూత్న ప్రయత్నం చేపట్టినట్లు తెలుస్తోంది.

'బూపతి_వ్లాగ్స్' అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. 'రోబో 2.0 సినిమా షూటింగ్ జరుగుతున్నట్లుంది', 'ఇకపై సిగ్నల్ దాటితే పోలీసుల బదులు రోబోనే చలాన్లు వేస్తుందేమో' అంటూ కామెంట్లు పెడుతున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

వీఐపీల కోసం సింహాన్ని బైక్‌లతో తరిమిన పార్క్ సిబ్బంది.. వీడియో వైరల్

జంగిల్ సఫారీలో పర్యాటకులకు షాక్.. దూసుకొచ్చిన పెద్దపులి!

Updated Date - Nov 19 , 2026 | 03:36 PM