Share News

పడుకున్న సిబ్బంది పక్కనే చోరీ.. వీడియో వైరల్

ABN , Publish Date - Aug 26 , 2026 | 03:21 PM

పెట్రోల్ బంక్‌లో ముగ్గురు ఉద్యోగులు గాఢ నిద్రలో ఉండగా.. ఓ దొంగ లోపలికి చొరబడి నగదు దోచుకెళ్లాడు. సీసీటీవీలో రికార్డైన ఈ ఘటన ఇప్పుడు పోలీసులకు కొత్త అనుమానాలు రేకెత్తిస్తోంది. వివరాల్లోకి వెళితే..

పడుకున్న సిబ్బంది పక్కనే చోరీ.. వీడియో వైరల్
Petrol Pump Theft

ఇంటర్నెట్ డెస్క్: ముగ్గురు ఉద్యోగులు గాఢ నిద్రలో ఉండగా.. ఓ దొంగ పెట్రోల్ పంప్‌లోకి చొరబడి నగదు దోచుకెళ్లాడు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలోని గడ్చందూర్ పట్టణంలో ఓ పెట్రోల్ పంప్‌లో జరిగిన చోరీ కలకలం రేపింది. రాజీవ్ గాంధీ చౌక్ వద్ద ఉన్న పెట్రోల్ పంప్ క్యాబిన్‌లో ముగ్గురు ఉద్యోగులు నిద్రిస్తుండగా.. అర్ధరాత్రి ఓ దొంగ కిటికీ ద్వారా లోపలికి ప్రవేశించాడు. ఉద్యోగులకు ఏమాత్రం అనుమానం రాకుండా సుమారు లక్షా ఇరవై వేల నగదును తీసుకుని.. చల్లగా జారుకున్నాడు. ఈ మొత్తం ఘటన పెట్రోల్ పంప్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఉదయం లేవగానే నగదు కనిపించకపోవడంతో ఉద్యోగులు పోలీసులకు సమాచారం అందించారు.


సీసీటీవీ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు..

సమాచారం అందుకున్న గడ్చందూర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఫుటేజీలో నిందితుడి కదలికలు స్పష్టంగా కనిపించడంతో అతడిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు.. ముగ్గురు ఉద్యోగులు క్యాబిన్‌లో నిద్రిస్తున్న సమయంలో దొంగ లోపలికి ప్రవేశించి నగదు అంత సులభంగా ఎలా తీసుకెళ్లాడు అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ చోరీలో పెట్రోల్ పంప్ సిబ్బందిలో ఎవరైనా ప్రమేయం ఉందా? అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. సీనియర్ అధికారుల మార్గదర్శకత్వంలో SHO శివాజీ కదమ్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం నిందితుడి కోసం గాలిస్తోంది.


ఇవి కూడా చదవండి

వారిద్దరిపై క్రమశిక్షణ కమిటీ నివేదిక సిద్ధం.. హైకమాండ్ నిర్ణయమే ఫైనల్

నెల్లూరులో రైల్వే పోలీసుల సెర్చ్‌ ఆపరేషన్‌.. ముగ్గురి అరెస్ట్‌

Updated Date - Aug 26 , 2026 | 05:25 PM