నెల్లూరులో రైల్వే పోలీసుల సెర్చ్ ఆపరేషన్.. ముగ్గురి అరెస్ట్
ABN , Publish Date - Aug 25 , 2026 | 06:11 PM
నెల్లూరులో రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. గూడూరు, నెల్లూరు రైల్వే పోలీసులు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో పట్టుబడ్డ నిందితుల నుంచి 104.248 గ్రాముల బంగారం, 180 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు.
నెల్లూరు: రైళ్లలో ప్రయాణికుల బ్యాగులు, బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న ముగ్గురు నిందితులను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలో గూడూరు, నెల్లూరు రైల్వే పోలీసుల ప్రత్యేక బృందాలు నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్‌లో వీరిని అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టైన వారిలో ఒకే కుటుంబానికి చెందిన తాల్లూరు అనిల్‌కుమార్, సునీల్‌తో పాటు షేక్ కాలేషా ఉన్నారు. వీరు రైళ్లలో ప్రయాణికుల బ్యాగులను ఎత్తుకెళ్లడంతో పాటు బంగారు ఆభరణాలను స్నాచింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
నిందితుల నుంచి 3 బ్యాగ్ లిఫ్టింగ్, 5 స్నాచింగ్ కేసులకు సంబంధించిన చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 8 కేసులకు సంబంధించి 104.248 గ్రాముల బంగారం, 180 గ్రాముల వెండి పట్టుబడింది. వీటి విలువ సుమారు రూ.13.65 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులపై గతంలోనూ నాలుగు దొంగతనం కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read:
ఏపీలో అన్ని ప్రాంతాల్లో సోలార్ ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాం: మంత్రి లోకేశ్
ఏపీలో సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు