Share News

వామ్మో.. బెంగళూరులో బట్టలు ఇస్త్రీ చేయించడం ఇంత ఖరీదా.. నోయిడా వాసి షాక్..

ABN , Publish Date - May 28 , 2026 | 01:47 PM

బెంగళూరులో పెరుగుతున్న జీవన వ్యయాలపై మరోసారి సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. బెంగళూరులో ఒక్క షర్టు ఇస్త్రీ చేయడానికి రూ.20 వసూలు చేశారని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.

వామ్మో.. బెంగళూరులో బట్టలు ఇస్త్రీ చేయించడం ఇంత ఖరీదా.. నోయిడా వాసి షాక్..
Bengaluru laundry prices

బెంగళూరులో పెరుగుతున్న జీవన వ్యయాలపై మరోసారి సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. బెంగళూరులో ఒక్క షర్టు ఇస్త్రీ చేయడానికి రూ.20 వసూలు చేశారని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. అదే పనికి నోయిడాలో చాలా తక్కువ చెల్లించేవాడినని ఆయన తెలిపారు. ఆయన పోస్ట్‌పై జోరుగా చర్చ జరుగుతోంది (Bengaluru laundry prices).


సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్ట్ ప్రకారం.. బెంగళూరులో ఒక షర్ట్ లేదా ప్యాంట్‌ను ఇస్త్రీ చేయడానికి రూ.20 వరకు తీసుకుంటున్నారని ఆ వ్యక్తి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. నోయిడాలో ఇదే పనికి కేవలం రూ.5 నుంచి రూ.8 వరకు మాత్రమే తీసుకుంటారని తెలిపాడు. ఈ పోస్టుపై అనేక మంది తమ అనుభవాలను పంచుకుంటున్నారు. బెంగళూరులో పెరుగుతున్న ధరల గురించి ఆందోళన వ్యక్తం చేశారు (Noida vs Bengaluru).


బెంగళూరులో అద్దెలు, కార్మిక వ్యయాలు, ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు ఎక్కువగా ఉండటంతో సేవల ధరలు కూడా అధికంగా ఉంటాయని ఒక వ్యక్తి వ్యాఖ్యానించారు (Bengaluru expensive living). ఐటీ నగరంగా మారిన తర్వాత బెంగళూరులో సాధారణ సేవల ఖర్చులు అమాంతం పెరిగిపోయాయని చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర నగరాలతో పోలిస్తే బెంగళూరులో అద్దెలు, ఆహారం, క్యాబ్ ఛార్జీలు, లాండ్రీ వంటి రోజువారీ సేవల ధరలు ఎక్కువని కొందరు అభిప్రాయపడ్డారు.


ఇవి కూడా చదవండి

వడదెబ్బ బాధితుల కోసం కేజీహెచ్‌లో ప్రత్యేక వార్డు: డాక్టర్ వాణి

అవలాంజి అటవీ ప్రాంతంలో తెల్ల పులి సంచారం

Updated Date - May 28 , 2026 | 01:47 PM