Share News

అమెరికాలోని ఇండియన్ స్టోర్‌లో డిస్కౌంట్స్.. కస్టమర్ల నిర్వాకం చూస్తే..

ABN , Publish Date - Jul 05 , 2026 | 10:30 AM

అమెరికాలోని న్యూ జర్సీలో ఓ ఇండియన్ సూపర్ మార్కెట్ ఓపెనింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డిస్కౌంట్ల కోసం ప్రవాస భారతీయులు ఒకరినొకరు నెట్టుకుంటూ ఎగబడ్డారు. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు..

అమెరికాలోని ఇండియన్ స్టోర్‌లో డిస్కౌంట్స్.. కస్టమర్ల నిర్వాకం చూస్తే..
Indian Supermarket New Jersey

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని న్యూ జర్సీలో ఓ ఇండియన్ సూపర్ మార్కెట్ ఓపెనింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డిస్కౌంట్ ఉండడంతో ప్రవాస భారతీయులు ఒకరినొకరు నెట్టుకుంటూ ఎగబడటంపై నెటిజన్లు అవాక్కవుతున్నారు. న్యూ జర్సీలో కొత్తగా ప్రారంభమైన ఒక భారతీయ సూపర్ మార్కెట్ ఓపెనింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో.. కొత్తగా ఏర్పాటైన సూపర్ మార్కెట్ ప్రారంభోత్సవం సందర్భంగా కూరగాయలు, పండ్లు, ఇతర నిత్యావసర వస్తువులపై భారీ డిస్కౌంట్లు ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ ఆఫర్లను దక్కించుకోవడానికి ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఒక్కసారిగా భారీ సంఖ్యలో జనాలు రావడంతో స్టోర్ మొత్తం కిక్కిరిసిపోయింది. కొనుగోలుదారులు ఒకరినొకరు నెట్టుకుంటూ, ప్లాస్టిక్ బ్యాగుల్లో సరుకులు నింపుకోవడానికి పోటీ పడ్డారు. ఈ తోపులాటలో వృద్ధులు సైతం ఇబ్బందులు పడటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

అల్లూరి ఆశయాలే దేశానికి మార్గదర్శకం: పవన్ కల్యాణ్

డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేలా తృప్తి క్యాంటీన్‌లను ప్రోత్సహిస్తున్నాం: మంత్రి నారాయణ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 05 , 2026 | 10:51 AM