నేపాల్‌లో కళ్ల ముందే కూలిన కొండచరియలు.. షాకింగ్ వీడియో వైరల్..
ABN , Publish Date - Sep 30 , 2026 | 11:27 AM
నేపాల్‌లోని మనంగ్ జిల్లాలో ఒక్కసారిగా భారీ కొండచరియలు విరిగిపడటంతో అక్కడి దృశ్యం క్షణాల్లో భయానకంగా మారింది. పెద్ద బండరాయితో పాటు చెట్లు, ఇళ్ల భాగాలు కిందికి జారిపడిన దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. ఈ షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: నేపాల్‌లోని మనంగ్ జిల్లాలోని చామే ప్రాంతంలో కొండచరియలు విరిగిపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వైరల్ వీడియోలో మొదట కొండ ప్రాంతం సాధారణంగానే కనిపించగా.. ఒక్కసారిగా భారీ బండరాయి, మట్టి, రాళ్లు కిందకు జారడం ప్రారంభించాయి. చూస్తుండగానే కొండలోని ఓ పెద్ద భాగం కుప్పకూలిపోయింది. దాంతో కొండపై ఉన్న చెట్లు నేలకొరిగాయి. సమీపంలో ఉన్న ఓ ఇంటి భాగం కూడా కొండచరియలతో పాటు కిందికి జారిపడుతున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. ఈ ఘటన కేవలం కొన్ని క్షణాల్లోనే జరగడంతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా భయానకంగా మారింది.
ముఖ్యంగా పెద్ద బండరాయి ఒక్కసారిగా కూలిపోవడం, దాని వెంటనే చెట్లు, నిర్మాణాలు కూడా జారిపోవడం చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ దృశ్యాలు చామే ప్రాంతంలో చిత్రీకరించినవిగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కొన్ని సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం స్పష్టంగా తెలియాల్సి ఉంది.
ఈ వీడియో @zingabad అనే యూజర్ ఎక్స్‌లో ట్వీట్ పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘ఆ దృశ్యం చూస్తుంటే వెన్నుల్లో వణుకు పుడుతుంది’ అని, ‘ఇలాంటి ప్రదేశాల్లో ఎలా జీవిస్తారు?’ అని ఒకరు, ‘ఇంకా నయం అక్కడ మనుషులు లేరు..’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
బంగారం చోరీ.. ఏమాత్రం తగ్గని యూట్యూబర్..
భారీ మొసలిని అవలీలగా ఎత్తేసిన మహిళ.. వీడియో వైరల్..