ముంచుకొస్తున్న వరద.. ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు.. వీడియో వైరల్
ABN , Publish Date - Aug 27 , 2026 | 01:54 PM
నేపాల్‌లో వరదలు వందల మందిని బలి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రకృతి ప్రకోపానికి ఆ దేశం చిగురుటాకులా వణికిపోయింది. వరద ఉధృతి నుంచి తప్పించుకునేందుకు కొందరు కార్మికులు పరుగులు పెట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: నేపాల్‌లో వరదలు వందల మందిని బలి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రకృతి ప్రకోపానికి ఆ దేశం చిగురుటాకులా వణికిపోయింది. భారీ వరదలు ఒక్కసారిగా విరుచుకుపడి అమాయక ప్రజల ప్రాణాలను హరించాయి. వీటికి సంబంధించిన అనేక వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. తాజాగా వరద ఉధృతి నుంచి తప్పించుకునేందుకు కొందరు కార్మికులు పరుగులు పెట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.
ఓ నది సమీపంలో సేఫ్టీ హెల్మెట్లు ధరించిన కొంత మంది కార్మికులు పని చేసుకుంటున్నారు. అప్పుడే అకస్మాత్తుగా వరద వారిపైకి ముంచుకొచ్చింది. దీంతో ప్రాణాలను రక్షించుకోవడం కోసం వారంతా కాళ్లకు పనిచెప్పారు. వరద విలయం నుంచి తప్పించుకునేందుకు వేగంగా పరుగులు పెట్టారు. ఆ తర్వాత ఓ హెలికాఫ్టర్ వచ్చి తమను కాపాడిందని ఓ వర్కర్ చెప్పాడు. ఈ సంఘటనను స్థానికులు వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. అది నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ప్రాణం కోసం చెట్టెక్కిన మరో వ్యక్తి..
మరో వ్యక్తి తనను తాను కాపాడుకోవడం కోసం ఓ మామిడి చెట్టు పైకి ఎక్కేశాడు. వరద ఉధృతి తగ్గే వరకు చెట్టుపైనే ఉండటంతో క్షేమంగా బయటపడ్డాడు. ఆ తర్వాత మాట్లాడుతూ.. వరద నీరు తన వైపు వేగంగా దూసుకొచ్చిందని, చెట్టు ఎక్కడంతో ప్రాణాలు కాపాడుకోగలిగినట్లు తెలిపాడు. కాగా, ఈ వరద ప్రవాహానికి సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
నేపాల్‌లో వరద బీభత్సం.. ఊళ్లకు ఊళ్లు మాయం.. భయానకంగా ఏరియల్ దృశ్యాలు
నేపాల్‌లో వరద బీభత్సం.. వెలుగులోకి ఒళ్లు గగుర్పొడిచే వీడియోలు..