నేపాల్‌లో వరద బీభత్సం.. వెలుగులోకి ఒళ్లు గగుర్పొడిచే వీడియోలు..
ABN , Publish Date - Aug 26 , 2026 | 08:34 PM
నేపాల్‌లో వరదల విలయానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డాయిమోన్ హూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ అయిన ఓ వీడియోలో భయానక దృశ్యాలు ఉన్నాయి.
ఇంటర్‌నెట్ డెస్క్: నేపాల్‌లో వరదల విలయానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డాయిమోన్ హూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ అయిన ఓ వీడియోలో భయానక దృశ్యాలు ఉన్నాయి. ఆ వీడియోలో.. పర్యాటకులు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా వరద నీరు వారి వైపు దూసుకువచ్చింది. దీంతో భయపడిపోయిన పర్యాటకులు కొండ మీదకు పరుగులు తీయటం మొదలెట్టారు. అయితే, కొంతమంది పర్యాటకులు వరద నుంచి తప్పించుకోలేకపోయారు.
వరద నీరు వారిని ముంచెత్తింది. పదుల సంఖ్యలో జనం నీటిలో కొట్టుకుపోయారు. కొంతమంది కొండ మీదకు సగం ఎక్కి ఆగిపోయారు. వరద నీరు తమ వరకు రాదని వారు భావించారు. ఊహించని విధంగా వరద నీటిలో వారు కూడా కొట్టుకుపోయారు. కొండపై వరకు ఎక్కిన వారు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. 2 నిమిషాల 7 సెకన్ల నిడివి కలిగిన ఆ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘ఈ వీడియో చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. గల్లంతయిన వారు ప్రాణాలతో ఉండాలని దేవుడ్ని కోరుకుంటున్నా’..‘అయ్యో పాపం. నేపాల్‌కు ప్రపంచ దేశాలు అండగా నిలవాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
వసంత కుమార్ కుటుంబానికి పార్టీ, ప్రభుత్వం అండగా ఉంటాయి: సీఎం చంద్రబాబు భరోసా
హైడెన్సిటీ రైలు మార్గాల విస్తరణ.. మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన