Share News

ముజఫర్‌నగర్‌లో 'చెంపదెబ్బల ముఠా' కలకలం..

ABN , Publish Date - Apr 10 , 2026 | 02:59 PM

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో గత కొన్ని రోజులుగా ఒక వింత ముఠా ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. దీనిని స్థానికులు 'చెంపదెబ్బల ముఠా' (థప్పడ్ గ్యాంగ్) అని పిలుస్తున్నారు.

ముజఫర్‌నగర్‌లో 'చెంపదెబ్బల ముఠా' కలకలం..
Muzaffarnagar Slap Gang

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో గత కొన్ని రోజులుగా ఒక వింత ముఠా ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. దీనిని స్థానికులు 'చెంపదెబ్బల ముఠా' (థప్పడ్ గ్యాంగ్) అని పిలుస్తున్నారు. ఈ ముఠా సభ్యులు డబ్బు కోసమో, నగలు దొంగిలించడానికో కాకుండా, కేవలం వినోదం కోసం లేదా జనాలను భయబ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కొత్తలో ఇది కేవలం ఒకరు ఇద్దరు మాత్రమే అనుకున్నారు.. కానీ నిత్యం ఇలాంటి సంఘటనలు జరుగుతుండటంతో జనాల్లో భయం వ్యాపిస్తోంది. బాధితులు ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.


రెండు రోజుల క్రితం ఒక యువకుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, బైక్‌పై కొందరు యువకులు అతని చెంపపై బలంగా కొట్టి, తేరుకునే‌లోపే మాయమయ్యారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న పీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో ఒంటరిగా బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. దాడి జరుగుతున్న ఏరియాల్లో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బైక్ నెంబర్లను గుర్తించి నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ బొత్స

ఐఏఎస్‌లను బెదిరించి చీకటి జీవోలు తెచ్చారు.. కేసీఆర్‌పై ఎంపీ చామల ధ్వజం

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 10 , 2026 | 03:46 PM