Share News

రీల్ కోసం రాయి విసిరాడు.. వీడియో వైరల్ కావడంతో..

ABN , Publish Date - Aug 19 , 2026 | 05:38 PM

రీల్స్‌ కోసం యువత చేస్తున్న ప్రమాదకర విన్యాసాలు రోజురోజుకూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఓ యువకుడు కదులుతున్న రైలుపై రాళ్లు విసురుతున్నట్లుగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

రీల్ కోసం రాయి విసిరాడు.. వీడియో వైరల్ కావడంతో..
Mumbai Local Train Viral Video

ఇంటర్నెట్ డెస్క్: ముంబై లోకల్ రైళ్లపై రాళ్లు విసురుతున్నట్లు, ప్రయాణికులకు అసభ్య సంజ్ఞలు చేస్తున్నట్లు కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దిఘాకు చెందిన ఓ యువకుడు చిక్కుల్లో పడ్డాడు. సంపాడ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) పోలీసులు అతడిని గుర్తించి రైల్వే చట్టం కింద కేసు నమోదు చేశారు.

కేసు నమోదు కావడంతో యువకుడు.. క్షమాపణ చెబుతూ సోషల్ మీడియాలో వీడియోను విడుదల చేశాడు. తాను రైలుపై నిజంగా రాయి విసరలేదని,.. కేవలం రీల్‌ కోసం అలా నటించానని చెప్పాడు. ‘నేను నిజంగా ఆ రాయిని రైలుపైకి విసరలేదు.. పక్కకు విసిరేశాను. రైలుపైకి విసురుతున్నట్లు కేవలం నటించాను’ అంటూ చేతులు జోడించి క్షమాపణలు కోరాడు. ఇకపై ఇలాంటి తప్పు చేయబోనని తెలిపాడు.


వైరల్ వీడియోపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటన సమయంలో నిజంగా ఏదైనా రైలు లేదా ప్రయాణికుడిని లక్ష్యంగా చేసుకున్నాడా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. సోషల్ మీడియాలో రీల్స్ కోసం యువత ప్రమాదకర విన్యాసాలకు పాల్పడటం, రైల్వే ట్రాక్‌ల సమీపంలో వీడియోలు చిత్రీకరించడం ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. కేవలం సోషల్ మీడియా వైరల్ కోసం చేసే ఇలాంటి చర్యలు ప్రాణాలకు ముప్పు కలిగించడంతో పాటు చట్టపరమైన సమస్యలకు కూడా దారితీస్తాయని స్పష్టం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

విద్యార్థుల నిరసనలపై విజయ్ సర్కార్ యూ-టర్న్.. 24 గంటల్లోనే ఆదేశాలు వెనక్కి

నటి నిధి అగర్వాల్ ప్రమోట్ చేసిన యాప్స్‌పై ఈడీ దర్యాప్తు ముమ్మరం

Updated Date - Aug 19 , 2026 | 06:30 PM