Share News

ట్రైన్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్నారు.. ఇదిగో వీడియో

ABN , Publish Date - Aug 26 , 2026 | 02:43 PM

ముంబై లోకల్ రైళ్లలో సీటు కోసం వాగ్వాదాలు, చిన్నపాటి వివాదాలు అప్పుడప్పుడు గొడవలకు దారితీస్తుంటాయి. ప్రయాణికుల మధ్య తోపులాటలు, మాటామాటా పెరగడం, చివరకు కొట్టుకునే వరకూ వెళ్లడం వంటి ఘటనలు తరచూ వార్తల్లో కనిపిస్తుంటాయి. అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది..

ట్రైన్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్నారు.. ఇదిగో వీడియో
Mumbai Local Train Fight

ఇంటర్నెట్ డెస్క్: ముంబై లోకల్ రైళ్లలో సీటు కోసం వాగ్వాదాలు, చిన్నపాటి వివాదాలు అప్పుడప్పుడు గొడవలకు దారితీస్తుంటాయి. ప్రయాణికుల మధ్య తోపులాటలు, మాటామాటా పెరగడం, చివరకు కొట్టుకునే వరకూ వెళ్లడం వంటి ఘటనలు తరచూ వార్తల్లో కనిపిస్తుంటాయి. అలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ముంబైలో కదులుతున్న లోకల్ రైల్లో ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటూ.. తిట్టుకుంటున్నట్టు కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రద్దీగా ఉన్న పురుషుల కంపార్ట్‌మెంట్‌లో జరిగిన ఈ గొడవను చూసిన తోటి ప్రయాణికులు జోక్యం చేసుకుని ఇద్దరినీ విడదీశారు. అయితే ఈ ఘటన ఏ లోకల్ రైలులో జరిగిందో.. గొడవకు అసలు కారణం ఏమిటో తెలియరాలేదు.


ముంబై లోకల్ రైల్లో ప్రయాణికుల మధ్య జరిగిన ఘర్షణ.. 24 గంటల్లోనే ఇది రెండో ఘటనగా తెలుస్తోంది. అంతకుముందు ఇద్దరు మహిళలు లోకల్ రైలులో గొడవపడిన వీడియో కూడా వైరల్ అయింది. ముంబై లోకల్ రైళ్లు ప్రతిరోజూ లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. ముఖ్యంగా రద్దీ సమయాల్లో కంపార్ట్‌మెంట్లలో తీవ్ర రద్దీ ఉండటంతో చిన్నపాటి వాగ్వాదాలు పెద్ద గొడవలకు దారితీసే అవకాశం ఉంటుంది.


ఇవి కూడా చదవండి

వారిద్దరిపై క్రమశిక్షణ కమిటీ నివేదిక సిద్ధం.. హైకమాండ్ నిర్ణయమే ఫైనల్

నెల్లూరులో రైల్వే పోలీసుల సెర్చ్‌ ఆపరేషన్‌.. ముగ్గురి అరెస్ట్‌

Updated Date - Aug 26 , 2026 | 04:05 PM