ప్రభుత్వ వర్క్‌షాప్‌లో కొండముచ్చు హల్‌చల్.. వీడియో వైరల్
ABN , Publish Date - May 23 , 2026 | 10:33 AM
గుజరాత్‌లో 2026 జనాభా లెక్కల సన్నాహాల కోసం ఏర్పాటు చేసిన ఒక అధికారిక ప్రభుత్వ వర్క్‌షాప్‌లో తమాషా సంఘటన చోటు చేసుకుంది..
ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్‌లో 2026 జనాభా లెక్కల సన్నాహాల కోసం ఏర్పాటు చేసిన ఒక అధికారిక ప్రభుత్వ వర్క్‌షాప్‌లో తమాషా సంఘటన చోటు చేసుకుంది. శిక్షణ కోసం ఉద్యోగులు ఆడిటోరియానికి హాజరయ్యారు. శిక్షణ కార్యక్రమం సాగుతున్న సమయంలో.. ఒక కొండముచ్చు హాల్లోకి ప్రవేశించింది. దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. లోపలికి వచ్చిన కొండముచ్చు.. ఓ మహిళా ఉద్యోగి కుర్చీ పైకి ఎక్కింది.
వైరల్ అవుతున్న వీడియోలో.. శిక్షణకు హాజరైన ఒక మహిళా ఉద్యోగి కుర్చీ పైన కొండముచ్చు ప్రశాంతంగా కూర్చుని కనిపించింది. కొండముచ్చు వెనుకే ఉండడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. ఎక్కడ దాడి చేస్తుందో ఏమో అనే భయంతో కదలకుండా అలాగే ఉండిపోయింది. చుట్టూ ఉన్న వారు కూడా కొండముచ్చును ఏమీ అనకుండా సైలెంట్‌గా ఉన్నారు. మొత్తానికి కొండముచ్చు చేష్టలు చూసి అక్కడున్న వారంతా నవ్వుకున్నారు. కొండముచ్చు ఎవరికీ హాని చేయకుండా వెళ్లిపోవడంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మహానాడులో 20 తీర్మానాలు.. రాజకీయ అంశాలపై విస్తృత చర్చ
తాగునీటి నాణ్యతపై రాజీ పడొద్దు.. అధికారులకు పవన్ కల్యాణ్ ఆదేశాలు