Share News

మోనాలిసా కాదు.. ‘కన్వర్ యాత్ర వైరల్ షేర్నీ’గా పిలవండి: మాన్సీ ఠాకూర్

ABN , Publish Date - Aug 15 , 2026 | 11:31 AM

కన్వర్‌ యాత్ర సందర్భంగా 180 కిలోమీటర్లు నడిచి, 61 లీటర్ల కన్వర్‌ను మోసిన మాన్సీ ఠాకూర్‌ ఒక్కసారిగా సోషల్‌ మీడియా స్టార్‌గా మారారు. అయితే తనను మోనాలిసాతో పోల్చడం ఆమెకు నచ్చలేదు. పేరు, రూపంతో కాదు.. మహాదేవునిపై తన భక్తితోనే గుర్తింపు పొందాలంటూ మాన్సీ చెప్పిన మాటలు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి..

మోనాలిసా కాదు.. ‘కన్వర్ యాత్ర వైరల్ షేర్నీ’గా పిలవండి: మాన్సీ ఠాకూర్
Mansi Rajput

ఇంటర్నెట్ డెస్క్: కన్వర్ యాత్రలో 61 లీటర్ల కన్వర్‌ను మోసుకుంటూ సుమారు 180 కిలోమీటర్లు నడిచిన మాన్సీ ఠాకూర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. మాన్సీ రాజ్‌పుత్‌గా కూడా గుర్తింపు పొందిన ఆమెను గతంలో మహాకుంభ్ సందర్భంగా వైరల్ అయిన మోనాలిసాతో పోల్చుతూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. అయితే ఈ పోలికపై మాన్సీ తీవ్రంగా స్పందించారు. తాను సనాతని, మహాదేవుని భక్తురాలినని.. తనను మోనాలిసాతో పోల్చడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. తన సొంత గుర్తింపుతోనే ప్రజలు తనను గుర్తించాలని కోరుకుంటున్నానని ఆమె తెలిపారు.


ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాన్సీ మాట్లాడుతూ.. ‘నేను మాన్సీ ఠాకూర్‌ని. నన్ను మోనాలిసాతో పోల్చొద్దు. నన్ను కన్వర్ యాత్ర వైరల్ షేర్నీ, మాన్సీ రాజ్‌పుత్ అని పిలవాలి. నేను సనాతనిని, మహాదేవుని భక్తురాలిని. మోనాలిసా ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకోవడంపై ఎంతో వ్యతిరేకత వచ్చింది. నేను హిందూ మతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా’ అని అన్నారు.

మాన్సీ ఇటీవల కన్వర్ యాత్ర, సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తనకు వచ్చిన గుర్తింపు మోనాలిసాతో పోలికల వల్ల మాత్రమే కాకుండా.. తన కన్వర్ యాత్ర కారణంగా కూడా కొనసాగాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు . 61 లీటర్ల కన్వర్‌ను మోసుకుంటూ సుమారు 180 కిలోమీటర్లు నడిచిన ఆమె ప్రయాణం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మొదట్లో మాన్సీ రూపాన్ని మోనాలిసాతో పోల్చుతూ వచ్చిన ప్రచారం ఆమెకు గుర్తింపు తెచ్చినప్పటికీ, ఇప్పుడు తన శివభక్తి, ఆధ్యాత్మిక విశ్వాసాలు, కన్వర్ యాత్రను కేంద్రంగా చేసుకుని ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకోవాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి..

నవ భారత నిర్మాణంలో ప్రతి పౌరుడు కర్తవ్యనిష్టతో ముందుకు సాగాలి: సీఎం రేవంత్

గోల్కొండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 15 , 2026 | 11:51 AM