Share News

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎద్దుల కలకలం.. వీడియో వైరల్

ABN , Publish Date - Oct 23 , 2026 | 02:51 PM

ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం సాయంత్రం రెండు ఎద్దులు ఎమర్జెన్సీ వార్డులోకి ప్రవేశించడంతో తీవ్ర కలకలం రేగింది.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎద్దుల కలకలం.. వీడియో వైరల్
Mahoba Hospital

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం సాయంత్రం రెండు వీధి ఎద్దులు ఎమర్జెన్సీ వార్డులోకి ప్రవేశించడంతో తీవ్ర కలకలం రేగింది. అత్యవసర చికిత్స పొందుతున్న రోగుల మధ్య ఎద్దులు స్వేచ్ఛగా తిరగడంతో రోగులు, వారి బంధువులు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. కొందరు రోగులు తమ పడకలపై నుంచి దిగిపోగా.. వారి బంధువులు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నించారు. ఆసుపత్రి సిబ్బంది ఒక ఎద్దును బయటకు పంపించగలిగినప్పటికీ.. రెండో ఎద్దు వార్డులోనే తిరుగుతుండటంతో ఆందోళన కొనసాగింది.


భద్రతా ఏర్పాట్లపై రోగి బంధువుల ఆగ్రహం..

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన స్నేహితుడిని పరామర్శించేందుకు వచ్చిన బ్రజ్రాజ్ సింగ్.. ఎమర్జెన్సీ వార్డులోకి ఎద్దు ప్రవేశించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న రోగులపై ఎద్దులు దాడి చేస్తే తీవ్ర గాయాలయ్యే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఆసుపత్రిలో భద్రతా సిబ్బంది అందుబాటులో ఉంటున్నారా? అనే సందేహాలను కూడా ఆయన లేవనెత్తారు. జంతువులు ఆసుపత్రి ప్రాంగణంలోకి ప్రవేశించకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సందర్శకులు కోరుతున్నారు.


ఇవి కూడా చదవండి..

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు దగ్గరపడింది.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..

మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Oct 23 , 2026 | 05:39 PM