Share News

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు దగ్గరపడింది.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..

ABN , Publish Date - Oct 22 , 2026 | 07:27 AM

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా, ఉక్రెయిన్‌లతో కలిసి త్రైపాక్షిక శాంతి చర్చలను తిరిగి ప్రారంభించేందుకు రష్యా సూత్రప్రాయంగా అంగీకరించింది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు దగ్గరపడింది.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
Ukraine Peace Talks

ఇంటర్నెట్ డెస్క్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా, ఉక్రెయిన్‌లతో కలిసి త్రైపాక్షిక శాంతి చర్చలను తిరిగి ప్రారంభించేందుకు రష్యా సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ పరిణామంతో యుద్ధానికి ముగింపు దగ్గరపడుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్ సమావేశమైన అనంతరం ఈ పరిణామం వెలుగులోకి వచ్చింది (Russia Ukraine War).


రష్యా విదేశాంగ వ్యవహారాల సలహాదారు యూరీ ఉషకోవ్ తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 10 తర్వాత అమెరికా, ఉక్రెయిన్‌లతో చర్చలను తిరిగి ప్రారంభించేందుకు పుతిన్ సూత్రప్రాయంగా అంగీకరించారు. యుద్ధం ముగిసిన తర్వాత రష్యా, ఉక్రెయిన్‌లకు సంబంధించిన భద్రతా వ్యవస్థను రూపొందించడం ఈ చర్చల్లో ప్రధాన అంశంగా ఉండనుంది. అమెరికా మధ్యవర్తిత్వంతో చర్చలు తిరిగి ప్రారంభించేందుకు ఉక్రెయిన్ కూడా సుముఖత వ్యక్తం చేసింది. వీలైనంత త్వరగా చర్చలు జరగాలని, యుద్ధాన్ని ముగించి శాంతిని నెలకొల్పడమే తమ లక్ష్యమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు (Ukraine Peace Talks).


రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే ప్రయత్నాల్లో చాలా పురోగతి కనిపిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు (Russia US Relations). యుద్ధానికి ముగింపు పలికే విషయంలో ప్రస్తుతం అత్యంత కీలక దశలో ఉన్నామని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, రష్యాతో చర్చలను ముందుకు తీసుకెళ్లడంలో అమెరికా కీలక పాత్ర పోషిస్తోంది. రష్యాలో పుతిన్‌తో జరిగిన సమావేశంలో స్టీవ్ విట్‌కాఫ్‌తో పాటు ఇతర ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. యుద్ధాన్ని ముగించేందుకు కొత్త ప్రతిపాదనలను పరిశీలించారు. అంతకుముందు నార్వేలో జెలెన్‌స్కీతో కూడా అమెరికా ప్రతినిధులు చర్చలు జరిపారు.


ఈ వార్తలను కూడా చదవండి..

టీవీ చానెళ్లు ప్రసార కార్యక్రమాల్లో నియమావళి పాటించాలి.. కేంద్రం అడ్వైజరీ

ఆర్‌ఎస్‌ఎస్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు.. పిల్ల చేష్టలని కొట్టిపడేసిన బీజేపీ

Updated Date - Oct 22 , 2026 | 08:31 AM