Share News

మహారాష్ట్రలో గాయపడిన పులితో ఆకతాయిల వికృత చేష్టలు.. వీడియో వైరల్

ABN , Publish Date - Nov 20 , 2026 | 03:39 PM

మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సిందేవాహి సమీపంలోని నాగ్‌పూర్ హైవేపై ఖత్‌గావ్ ఫాటా వద్ద రోడ్డు దాటుతున్న ఓ పులిని కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది.

మహారాష్ట్రలో గాయపడిన పులితో ఆకతాయిల వికృత చేష్టలు.. వీడియో వైరల్
Injured Tiger

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సిందేవాహి సమీపంలోని నాగ్‌పూర్ హైవేపై ఖత్‌గావ్ ఫాటా వద్ద రోడ్డు దాటుతున్న ఓ పులిని కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది. గురువారం ఉదయం సుమారు 10.15 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. బల్లార్‌పూర్‌కు చెందిన ఆశిష్ సుధాకర్ సంతోష్వార్ తన కుటుంబంతో కలిసి నాగ్భిడ్ నుంచి చంద్రాపూర్ వైపు కారులో ప్రయాణిస్తుండగా, అకస్మాత్తుగా పులి రోడ్డుపైకి వచ్చింది. ఈ క్రమంలో తొలుత ఓ ద్విచక్ర వాహనంపైకి దూసుకెళ్లిన పులి.. అనంతరం కారును ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలైంది. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ వాహనాన్ని నిలిపివేశాడు. అయితే ప్రమాదం తర్వాత గాయపడిన పులి రోడ్డు పక్కనే ఉన్న పొదల్లో పడిపోయింది. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది.


గాయపడిన పులిని రెచ్చగొట్టిన జనం..

ప్రమాదంలో గాయపడి పొదల్లో ఉన్న పులిని చూసేందుకు స్థానికులు, వాహనదారులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అయితే గాయాలతో బాధపడుతున్న పులి వద్ద కొందరు వికృతంగా ప్రవర్తించారు. వింత శబ్దాలు చేస్తూ దానిని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై వన్యప్రాణి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాయపడిన జంతువులను ఇబ్బందులకు గురిచేయకుండా, వాటికి తగిన చికిత్స అందించేందుకు సహకరించాలని సూచిస్తున్నారు. కాగా, ప్రమాదంలో గాయపడిన పులిని తొలుత సవర్‌గావ్‌కు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం చంద్రాపూర్‌లోని ట్రాన్సిట్ ట్రీట్‌మెంట్ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం అక్కడ పులికి వైద్య సంరక్షణ అందిస్తున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

వీఐపీల కోసం సింహాన్ని బైక్‌లతో తరిమిన పార్క్ సిబ్బంది.. వీడియో వైరల్

జంగిల్ సఫారీలో పర్యాటకులకు షాక్.. దూసుకొచ్చిన పెద్దపులి!

Updated Date - Nov 20 , 2026 | 04:11 PM