Share News

ఎముకలు కొరికే చలిలోనూ.. 4 రోజులుగా యజమాని శవం వద్దే శునకం.!

ABN , Publish Date - Jan 27 , 2026 | 01:25 PM

హిమాచల్ ప్రదేశ్‌లో ఒక భావోద్వేగాత్మక, హృదయ విదారకమైన ఘటన జరిగింది. ఓ పెంపుడు శునకం తన యజమాని మృతదేహాన్ని నాలుగు రోజుల పాటు కాపాడుకుంది. ఎముకలు కొరికే మంచు కొండల్లో అన్నపానీయాలు మానేసి కనురెప్ప వాల్చకుండా కాపుకాసింది.

ఎముకలు కొరికే చలిలోనూ.. 4 రోజులుగా యజమాని శవం వద్దే శునకం.!
Loyal Dog Story India

ఆంధ్రజ్యోతి, జనవరి 27: హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లా భర్మౌర్(Bharmaur) ప్రాంతంలో భర్మణి ఆలయం(Bharmani Temple) సమీపంలో ఒక దుర్ఘటన జరిగింది. ఇద్దరు యువకులు పియుష్ కుమార్(13), అతడి బంధువు విక్సిత్ రాణాతో కలిసి జనవరి 23న ట్రెక్కింగ్ కోసం(వీడియోలు షూట్ చేసేందుకు) కుక్రు కాండా(Kukru Kanda) పర్వత ప్రాంతానికి వెళ్లారు.

అకస్మాత్తుగా భారీ మంచు వర్షం(Blizzard), తీవ్రమైన చలి కారణంగా వారిద్దరూ అదృశ్యమయ్యారు. ఆ తర్వాత తీవ్రమైన చలికి గురవడంతో ఆ ఇద్దరూ మరణించారు. మంచు పొరల కింద వారి శరీరాలు కప్పబడిపోయాయి.


నాలుగు రోజుల తర్వాత రెస్క్యూ టీమ్‌లు(ఆర్మీ సహకారంతో) స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ వారు చూసిన దృశ్యం అందరి హృదయాల్నీ కరిగించింది. పియుష్ మృతదేహం మంచులో కప్పబడిపోగా.. అతని పెంపుడు శునంకం పక్కనే కూర్చుని ఉంది.

ఆ కుక్క నాలుగు రోజుల పాటు ఆహారం, నీరు ఏమీ తీసుకోకుండా.. భారీ మంచు, తీవ్ర చలిని ఎదుర్కొంటూ యజమాని శరీరాన్ని కాపాడుకుంది. అడవి జంతువులు, కఠిన వాతావరణం నుంచి తన యజమానికి రక్షణ కల్పించింది.


అంతేకాకుండా.. రెస్క్యూ టీమ్ తన పియుష్ డెడ్ బాడీని తీసుకెళ్లడానికి ప్రయత్నించగానే, తన యజమానికి హాని తలపెడుతున్నారనే భావనతో కుక్క మొదట దూకుడుగా ప్రవర్తించింది. కానీ సున్నితంగా దాన్ని దగ్గరకు తీసుకుని భరోసా వచ్చేలా ఓదార్చారు రెస్క్యూ టీమ్. దీంతో అది పక్కకు జరిగి వారిని అనుమతించింది.

ఈ ఘటన మానవులపై కుక్కలకు ఉన్న విశ్వాసం, ప్రేమ ఎంత గాఢమైనవో కళ్లకు కడుతోంది. మరణం తర్వాత కూడా ఆ శునకం యాజమానిని వదలలేదు. ఏది ఏమైనా ఆ కుక్కచేసిన పని.. లక్షలాది మందిని భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యేలా చేసింది.


ఇవి కూడా చదవండి:

ఈ సిరీస్ సూప్ లాంటిది.. అసలు విందు ముందుంది: సునీల్ గావస్కర్

బంగ్లాను పాక్ రెచ్చగొడుతోంది: బీసీసీఐ ఉపాధ్యక్షుడు

Updated Date - Jan 27 , 2026 | 01:51 PM