Share News

బైక్‌పై బాణసంచాతో ఎంట్రీ.. పెళ్లిలో రైడర్ హంగామా! వీడియో వైరల్

ABN , Publish Date - Sep 21 , 2026 | 12:11 PM

పెళ్లి అంటేనే సందడి.. ఇక వధూవరుల ఎంట్రీ అంటే మరింత స్పెషల్‌గా ఉండాలని చాలామంది కోరుకుంటారు. కానీ లిబియాలో జరిగినట్లు చెబుతున్న ఓ పెళ్లిలో మాత్రం బైక్‌పై బాణసంచాతో స్టంట్ రైడర్ చేసిన ఎంట్రీ అందరినీ షాక్‌కి గురిచేసింది. వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బైక్‌పై బాణసంచాతో ఎంట్రీ.. పెళ్లిలో రైడర్ హంగామా! వీడియో వైరల్
Libya Wedding Viral Video,

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లిళ్లలో వధూవరుల ప్రవేశాన్ని ప్రత్యేకంగా చేయడానికి ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని ఎంచుకుంటారు. పూలతో అలంకరించిన కార్లు, గుర్రాలు, విలాసవంతమైన రథాలతో ఎంట్రీ ఇచ్చే వారిని చూస్తుంటాం. అయితే లిబియాలో జరిగినట్లు చెబుతున్న ఓ పెళ్లి వేడుకలో మాత్రం ఓ రైడర్ బైక్‌పై చేసిన విన్యాసం అందరి దృష్టినీ ఆకర్షించింది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి వేగంగా బైక్‌పై దూసుకెళ్తూ స్టంట్స్ చేస్తుండగా, అదే సమయంలో బైక్‌ నుంచి బాణసంచా పేలడం కనిపించింది. పెళ్లి వేడుకకు వచ్చిన అతిథుల మధ్య బైక్ రైడర్ చేసిన ఈ విన్యాసాలు అక్కడి వాతావరణాన్ని మరింత హుషారెత్తించాయి. వేగంగా దూసుకెళ్తున్న బైక్, స్టంట్స్, బాణసంచా కలయికతో ఆ దృశ్యం ఏదైనా సినిమా యాక్షన్ సీన్‌ను తలపించేలా కనిపించింది.


ఈ వీడియో సోషల్ మీడియాలోకి వచ్చిన వెంటనే నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. కొందరు ఈ ఎంట్రీని పెళ్లిళ్లలో చూసిన అత్యంత విభిన్నమైన ప్రవేశంగా అభివర్ణిస్తుండగా.. మరికొందరు మాత్రం వధూవరుల కంటే స్టంట్ రైడర్‌పైనే అందరి చూపు పడేలా ఉందంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది ఇది డేంజరస్ స్టంట్ అని.. ప్రాణాలతో చెలగాటం అని కామెంట్స్ చేస్తున్నారు. వీడియోను షేర్ చేసిన పోస్టుల్లో కూడా లిబియాలో పెళ్లి వేడుకలో బైక్‌పై బాణసంచాతో స్టంట్ రైడర్ చేసిన హంగామాపై హాస్యభరితమైన క్యాప్షన్లు కనిపిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

దీపాలకేనా.. హాస్టళ్లకు నిధులు ఉండవా ?

అతి వేగంతో అదుపు తప్పిన బీఎండబ్ల్యూ కారు

Updated Date - Sep 21 , 2026 | 01:04 PM