కింగ్ కోబ్రా ముందు చిన్నారి డ్యాన్స్.. వీడియో వైరల్
ABN , Publish Date - Aug 19 , 2026 | 03:31 PM
పాము పేరు వింటేనే గుండెల్లో దడ మొదలవుతుంది. అలాంటిది ఓ చిన్నారి కింగ్ కోబ్రాను కవ్విస్తూ.. దాని ముందే డ్యాన్స్ చేయడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ‘ఇంత చిన్న వయసులో ఇంత ధైర్యమా..!’ అంటూ ఆశ్చర్యపోతున్నారు..
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో ఎవరైనా సరే పాము పేరు వింటేనే భయంతో వణికిపోతారు. అందులోనూ కింగ్ కోబ్రా అంటే ఆ భయం మరింత పెరిగిపోతుంది. అలాంటిది భారీ విషసర్పం ఎదురుగా ఉన్నా.. ఓ చిన్నారి ఏ మాత్రం భయపడలేదు. పైగా దాని ముందు డ్యాన్స్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో కింగ్ కోబ్రా దగ్గరకు వెళ్లిన చిన్నారి.. దానిని కవ్విస్తూ.. దాని ముందే డ్యాన్స్ చేస్తూ కనిపించింది. బాలిక తనను తట్టి లేపడంతో పాము ఒక్కసారిగా పడగ విప్పి దాడికి ప్రయత్నించింది. అయితే చిన్నారి వెంటనే వెనక్కి తగ్గింది. ఆ తర్వాత మళ్లీ డాన్స్ చేయడం మొదలెట్టింది.
ఇంతటితో ఆగని ఆ బాలిక.. పాము తోక పట్టుకుని పైకి ఎత్తేందుకు కూడా ప్రయత్నించింది. సాధారణంగా మనుషుల కదలికలకే దూకుడుగా స్పందించే కింగ్ కోబ్రా.. చిన్నారి ఇంతగా కవ్వించినప్పటికీ దాడి చేయకుండా ఉండటంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆ చిన్నారి డ్యాన్స్ కింగ్ కోబ్రాకు నచ్చినట్టుంది’ అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే విషపూరిత పాములతో ఇలాంటి సాహసాలు అత్యంత ప్రమాదకరమని, ఎవరూ ఇలా చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
విద్యార్థుల నిరసనలపై విజయ్ సర్కార్ యూ-టర్న్.. 24 గంటల్లోనే ఆదేశాలు వెనక్కి
నటి నిధి అగర్వాల్ ప్రమోట్ చేసిన యాప్స్‌పై ఈడీ దర్యాప్తు ముమ్మరం