Share News

త్రిస్సూర్‌లో విషాదం.. వ్యాన్ నుంచి జారిపడిన ఇనుప కడ్డీ.. బైకర్ మృతి

ABN , Publish Date - Aug 22 , 2026 | 03:00 PM

త్రిస్సూర్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కదులుతున్నవ్యాన్ నుంచి జారిపడిన ఇనుప కడ్డీ బైక్‌పై వెళ్తున్న యువకుడి శరీరంలోకి దూసుకెళ్లడంతో షెరిన్ జాన్ మృతి చెందాడు..

త్రిస్సూర్‌లో విషాదం.. వ్యాన్ నుంచి జారిపడిన ఇనుప కడ్డీ.. బైకర్ మృతి
Thrissur Accident

ఇంటర్నెట్ డెస్క్: త్రిస్సూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న పికప్ వ్యాన్ నుంచి జారిపడిన ఇనుప కడ్డీ బైక్‌పై వెళ్తున్న వ్యక్తి శరీరంలోకి చొచ్చుకుపోవడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని కుట్టనెల్లూరుకు చెందిన షెరిన్ జాన్‌గా పోలీసులు గుర్తించారు. కుట్టనెల్లూరులోని హైలైట్ మాల్ సమీపంలో నిన్న ఉదయం సుమారు 10:30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఇనుప రాడ్లను తరలిస్తున్న పికప్ వ్యాన్ వెనుకే షెరిన్ అనే వ్యక్తి తన బైకుపై వస్తుండగా.. వ్యాన్‌లోని రాడ్లు అకస్మాత్తుగా జారిపడ్డాయి. వాటిలో ఓ కడ్డీ నేరుగా షెరిన్‌ శరీరంలోకి చొచ్చుకుపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు.


ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే షెరిన్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతను అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన వ్యాన్‌ను స్వాధీనం చేసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

మనిషితో బాక్సింగ్ చేసిన చైనా రోబో.. కానీ ఆ చిన్న పని మాత్రం చేయలేకపోయింది..


మరింత పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Aug 22 , 2026 | 03:28 PM