పదవీ విరమణ.. బస్సుకు నమస్కరించి డ్రైవర్ భావోద్వేగ వీడ్కోలు
ABN , Publish Date - Sep 04 , 2026 | 04:44 PM
బస్సుకు ఓ కేరళ ఆర్టీసీ డ్రైవర్ ఆప్యాయంగా వీడ్కోలు పలికిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పదవీ విరమణ రోజున బస్సును కౌగిలించుకుని ముద్దుపెట్టుకున్న ఆయన.. భావోద్వేగానికి గురయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: ఏళ్ల తరబడి వేల కిలోమీటర్లు బస్సు నడిపిన ఓ కేరళ ఆర్టీసీ డ్రైవర్.. పదవీ విరమణ సమయంలో తన బస్సుకు ఆప్యాయంగా వీడ్కోలు పలికారు. ఇడుక్కి జిల్లా కట్టప్పనకు చెందిన పాల్ కురియన్.. ఎన్నో ఏళ్లుగా కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC)లో డ్రైవర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఉద్యోగంలో చివరి రోజు తన చివరి ట్రిప్‌ను పూర్తి చేసిన తర్వాత పాల్ బస్సు దిగిన అనంతరం బస్సుతో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు.
బస్సు ముందు, వెనుక టైర్ల వద్దకు వెళ్లి వాటిని చేతులతో తాకి నమస్కరించారు. తన ఉద్యోగ జీవితంలో ఎన్నో ప్రయాణాలకు తోడుగా నిలిచిన బస్సుకు కృతజ్ఞతలు చెబుతున్నట్టుగా ఆయన వీడ్కోలు పలికారు. పాల్ బస్సును కౌగిలించుకోవడం, ముద్దుపెట్టుకోవడం, చివరిసారిగా డ్రైవర్ సీట్లో కూర్చోవడం, అనంతరం టైర్లను తాకి నమస్కరించడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read:
కొండా సురేఖ మాటతీరు మార్చుకోవాలి: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
10 రోజులు ఇరుకైన సొరంగంలో ప్రాణాలతో చెలగాటం.. రక్షించిన ఆర్మీ సిబ్బంది