Share News

నెటిజన్లకు భయం పుట్టిస్తున్న సంఘటన.. వీడియో వైరల్

ABN , Publish Date - Jul 03 , 2026 | 12:44 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం భయపడుతున్నారు.

నెటిజన్లకు భయం పుట్టిస్తున్న సంఘటన.. వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: రహదారి పక్కనున్న టోల్ బూత్‌ను గ్యాస్ ట్యాంకర్ ఢీకొట్టింది. అనంతరం భారీ శబ్దంతో పెద్ద పేలుడు సంభవించింది. దానికి సంబంధించిన ఓ భయానక వీడియో ఇప్పుు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కౌశాంబిలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకెళితే.. రెండు గ్యాస్ ట్యాంకర్లు ఒకే సమయంలో టోల్ ప్లాజాలోకి ప్రవేశించాయి. అందులో ఓ గ్యాస్ ట్యాంకర్ నియంత్రణ కోల్పోయింది. దీంతో ఆ ట్యాంకర్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి టోల్ ప్లాజాలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత ఆ ట్యాంకర్ నుంచి గ్యాస్ లీకైంది. దీంతో భారీ పేలుడు సంభవించింది.toll plaza blast In UP


ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్మేయడం సహా భారీఎత్తున మంటలు చెలరేగాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గత జూన్ 26న ఈ ప్రమాదం జరగ్గా.. సంబంధిత సీసీటీవీ ఫుటేజీని పోలీసులు ఇటీవల విడుదల చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


కాగా.. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనను చూసిన మరుక్షణం నుంచి వణుకు పుడుతోందని కొందరు కామెంట్ చేయగా, ఒక్కోసారి జరిగే ప్రమాదాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఈ వీడియో ద్వారా స్పష్టమవుతోందని మరికొందరు అంటున్నారు.

Updated Date - Jul 03 , 2026 | 02:42 PM