Kanuma Festival Traditions: కనుమ స్పెషల్.. పాటించాల్సిన సంప్రదాయాలు ఇవే
ABN , Publish Date - Jan 16 , 2026 | 11:04 AM
సంక్రాంతి సంబరాల్లో మూడవ రోజు కనుమ.. భోగి మంటల వెచ్చదనం, మకర సంక్రాంతి పండుగ తర్వాత ఈ రోజున కనుమ పండుగను జరుపుకుంటున్నాం. ఈ పండుగ.. మనిషికి ప్రకృతికి, ముఖ్యంగా రైతుకి పశువులకి మధ్య ఉన్న విడదీయరాని అనుబంధానికి ప్రతీక.
ఇంటర్నెట్ డెస్క్: సంక్రాంతి పండుగను మూడు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి తర్వాత వచ్చే మూడో రోజు కనుమ. ఈ రోజు రైతులకు, పశుపోషకులకు ఎంతో ప్రత్యేకం. పశువులను స్నానం చేయించి, అలంకరించి, పూజలు చేసి ఊరేగింపుగా తీసుకెళ్లడం ఆనవాయితీ. అలాగే పశువులకు ఇష్టమైన ఆహారాన్ని ప్రత్యేకంగా వండి పెట్టడం కూడా సంప్రదాయమే. అయితే కనుమ నాడు ఏం చేయాలి, ఏం చేయకూడదు? అలాగే, కనుమ నాడు పొలిమేర దాటకూడదు, ప్రయాణం చేయకూడదు అని పెద్దలు చెబుతారు. దీనికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పశుపూజలు – పూర్వికులకు తర్పణాలు
కనుమ రోజున రైతులు తమ పశువులను కృతజ్ఞతతో పూజిస్తారు, వాటిని శ్రద్ధగా చూసుకుంటారు. పశువులను అలంకరించి, వాటికి హారతులు ఇవ్వడం, పసుపు కుంకుమ చల్లి నమస్కరించడం ఆనవాయితీ. అలాగే, మధ్యాహ్నం సమయంలో పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు.

కనుమ రోజున ప్రయాణం ఎందుకు చేయకూడదు?
పూర్వకాలంలో కనుమ నాడు ప్రయాణాలు చేయవద్దని చెప్పడం వెనుక చాలా పెద్ద కారణమే ఉంది. గతంలో వేరే ఊర్లకు వెళ్లడానికి వాహనాలు ఏవి ఉండేవి కాదు. కేవలం ఎడ్ల బండిపైనే మాత్రమే వెళ్లే అవకాశం ఉండేది. అయితే, కనుమ రోజును ఎడ్లను పూజించి వాటికి పూర్తిగా విశ్రాంతి కల్పించాలనే ఉద్దేశంతో ఎడ్ల బండ్లను ఉపయోగించేవారు కాదు. సంవత్సరమంతా కష్టపడి పని చేసే ఆ పశువులకు కనీసం ఒక్కరోజైనా విశ్రాంతి ఇవ్వాలనే మానవీయ భావనతోనే ఈ సంప్రదాయం ఏర్పడింది. అందుకే మూడు రోజుల పండుగ పూర్తయ్యాకే ప్రయాణాలు ప్రారంభించమని సూచిస్తారు.

Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు.
Also Read:
తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?
జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?
For More Latest News