Share News

బాబోయ్ పులి.. గుర్రాన్ని ఎలా ఈడ్చుకెళ్తోందో చూడండి.. షాకింగ్ వీడియో వైరల్..

ABN , Publish Date - Aug 19 , 2026 | 09:35 PM

ఉత్తరాఖండ్‌లోని జిమ్‌ కార్బెట్‌ నేషనల్‌ పార్క్‌ సమీపంలో పులి దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రామ్‌నగర్‌లోని గర్జియా ప్రాంతంలో పర్యాటకులు చూస్తుండగానే ఓ బెంగాల్‌ టైగర్ తన ప్రతాపం చూపించింది.

బాబోయ్ పులి.. గుర్రాన్ని ఎలా ఈడ్చుకెళ్తోందో చూడండి.. షాకింగ్ వీడియో వైరల్..
Tiger Attacks Horse

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాఖండ్‌లోని జిమ్‌ కార్బెట్‌ నేషనల్‌ పార్క్‌ సమీపంలో పులి దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రామ్‌నగర్‌లోని గర్జియా ప్రాంతంలో పర్యాటకులు చూస్తుండగానే ఓ బెంగాల్‌ టైగర్ తన ప్రతాపం చూపించింది. గుర్రంపై దాడి చేసి, దాన్ని అడవిలోకి ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనను పర్యాటకులు తమ కెమెరాల్లో చిత్రీకరించారు (Jim Corbett Tiger Attack).


గర్జియా ప్రాంతంలోని ఓ కూడలి సమీపంలో ఓ పులి ఒక్కసారిగా గుర్రంపై దాడి చేసింది. అనంతరం గుర్రం మెడను నోటితో పట్టుకుని అడవి లోపలికి లాక్కెళ్లింది. సఫారీ వాహనాల్లో ఉన్న పర్యాటకులు ఈ దృశ్యాలను చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పులి గుర్రాన్ని ఈడ్చుకెళ్తున్న సమయంలో కొందరు పిల్లలు భయంతో కేకలు వేయడం వీడియోలో వినిపించింది. పర్యాటక వాహనాలు దగ్గర్లోనే ఉన్నప్పటికీ, పులి ఏమాత్రం భయపడకుండా తన ఆహారాన్ని అడవిలోకి తీసుకెళ్లింది (Tiger Attacks Horse).


జిమ్‌ కార్బెట్‌ నేషనల్‌ పార్క్‌‌ దేశంలోనే అత్యధిక పులులను కలిగిన అభయారణ్యాల్లో ఒకటి (Tiger Attack Video). ప్రస్తుతం ఇక్కడ 260కి పైగా బెంగాల్‌ పులులు ఉన్నట్లు అంచనా. ఈ అభయారణ్యానికి పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. అడవిని సందర్శించే వారితో పాటు ప్రసిద్ధ గర్జియా ఆలయాన్ని దర్శించేందుకు వచ్చే పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు.


ఇవి కూడా చదవండి..

నీట్‌ పేపర్‌ లీక్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ఎన్‌టీఏ సంస్కరణలపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశం..


పుణెలో దారుణం.. 9 ఏళ్ల బాలికపై హత్యాచారం.. పొరుగింటి యువకుడి అరెస్ట్..

Updated Date - Aug 19 , 2026 | 09:39 PM