Share News

ఒత్తిడి తగ్గించుకునేందుకు రూ.258 కోట్ల షాపింగ్.. అరెస్టైన జపాన్ మహిళ..

ABN , Publish Date - Aug 08 , 2026 | 09:35 PM

తీవ్ర ఒత్తిడికి గురైన ఓ జపాన్ మహిళ విచిత్రమైన పని చేసింది. తన ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఆన్‌లైన్ షాపింగ్‌ను ఎంచుకుంది. ఆన్‌లైన్‌లో వస్తువులను ఆర్డర్ చేసి, వాటిని తీసుకోకుండా తిరస్కరించడం ఆమెకు అలవాటుగా మారింది.

ఒత్తిడి తగ్గించుకునేందుకు రూ.258 కోట్ల షాపింగ్.. అరెస్టైన జపాన్ మహిళ..
₹258 crore online orders

తీవ్ర ఒత్తిడికి గురైన ఓ జపాన్ మహిళ విచిత్రమైన పని చేసింది. తన ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఆన్‌లైన్ షాపింగ్‌ను ఎంచుకుంది. ఆన్‌లైన్‌లో వస్తువులను ఆర్డర్ చేసి, వాటిని తీసుకోకుండా తిరస్కరించడం ఆమెకు అలవాటుగా మారింది. అలా ఆమె చేసిన షాపింగ్ ఏకంగా రూ.258 కోట్లకు చేరింది. చివరకు ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు (Rs.258 crore online orders).


టోక్యోకు చెందిన 32 ఏళ్ల మయు యోషిదా అనే మహిళ 2024 నుంచి 2025 మధ్య ప్రముఖ యానిమే సంస్థ షూయేషా ఆన్‌లైన్ దుకాణంలో భారీగా ఆర్డర్లు చేసింది. యోషిదా ఏకంగా 230కి పైగా నకిలీ ఖాతాలు, పేర్లను ఉపయోగించి 2,000కు పైగా ఆర్డర్లు చేసింది. ఆమె ప్రధానంగా ‘నరుటో’, ‘వన్ పీస్’ వంటి ప్రముఖ యానిమే సిరీస్‌లకు సంబంధించిన వస్తువులను ఆర్డర్ చేసింది. ఈ ఆర్డర్ల మొత్తం విలువ సుమారు 4.3 బిలియన్ జపాన్ యెన్లు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.258 కోట్లు (Japanese woman online shopping).


ఆర్డర్లు చేసేటప్పుడు ఆమె క్యాష్ ఆన్ డెలివరీ విధానాన్ని ఎంచుకునేది. వస్తువులు ఇంటికి చేరుకున్న తర్వాత వాటిని తీసుకోకుండా తిరస్కరించేది. కొన్ని సందర్భాల్లో వస్తువులు పంపకముందే ఆర్డర్లను రద్దు చేసేది. ఇంకొన్ని సార్లు తప్పుడు అడ్రస్‌లు ఇచ్చేది. దీంతో ఆన్‌లైన్ సంస్థకు ప్యాకింగ్, రవాణా తదితర ఖర్చుల రూపంలో భారీ నష్టం వాటిల్లింది. ఆ సంస్థ దాదాపు రూ.45 లక్షల రూపాయలు నష్టపోయింది (Stress shopping).


ఆర్డర్ల కారణంగా తమకు జరిగిన నష్టంపై షూయేషా సంస్థ టోక్యోలోని కందా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నకిలీ ఖాతాలు, భారీ సంఖ్యలో ఆర్డర్ల వ్యవహారాన్ని గుర్తించారు. అనంతరం ఆగస్టు 4, 2026న యోషిదాను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో యోషిదా తన నేరాన్ని అంగీకరించింది. రోజువారీ జీవితంలోని ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఇలా ఆన్‌లైన్‌లో ఆర్డర్లు చేసేదానినని ఆమె తెలిపింది.


ఇవి కూడా చదవండి..

యూపీఐ చెల్లింపులు ఉచితమే: ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్


డీప్‌ఫేక్‌ వీడియోలపై కేంద్రం కన్నెర్ర.. చర్యలు తీసుకోవాలని మెటాకు అదేశం..

Updated Date - Aug 08 , 2026 | 09:35 PM