Share News

ఇటలీ కాప్రి తీరంలో ఒకేసారి రెండు జల సుడిగాలులు.. అద్భుత దృశ్యం

ABN , Publish Date - Nov 11 , 2026 | 04:25 PM

సముద్రం మధ్యలో ప్రకృతి సృష్టించిన అద్భుత దృశ్యం చూపరులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నీలి సముద్రపు నీటిపై ఒకేసారి రెండు భారీ జల సుడిగాలులు ఏర్పడటంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా ఉత్కంఠభరితంగా మారింది.

ఇటలీ కాప్రి తీరంలో ఒకేసారి రెండు జల సుడిగాలులు.. అద్భుత దృశ్యం
Capri Italy

ఇంటర్నెట్ డెస్క్: ఇటలీలోని అందమైన కాప్రి తీర ప్రాంతం వార్తల్లో నిలిచింది. సముద్రం నడిబొడ్డున అకస్మాత్తుగా రెండు భారీ జల సుడిగాలులు ఏర్పడటంతో అక్కడి దృశ్యం ఎంతో అద్భుతంగా కనిపించింది. సముద్రపు ఉపరితలం నుంచి ఆకాశం వైపు నీటిని లాగుతున్నట్లుగా కనిపించిన ఈ సుడిగాలులు కొద్దిసేపు భారీ ఆకారంలో కొనసాగాయి.

సాధారణంగా వెచ్చని సముద్ర ఉపరితలం, తేమతో కూడిన గాలి, వాతావరణంలోని అనుకూల పరిస్థితుల కారణంగా ఇటువంటి జల సుడిగాలులు ఏర్పడతాయి. అయితే.. ఒకే సమయంలో రెండు జల సుడిగాలులు కనిపించడం ఈ దృశ్యాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది. సముద్రం మధ్యలో ఏర్పడిన ఈ ప్రకృతి వింతను చూసినవారు తమ కెమెరాల్లో బంధించారు. అనంతరం ఆ వీడియో సోషల్ మీడియాలోకి రావడంతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.


ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ప్రకృతి సృష్టించిన అద్భుతమంటూ ప్రశంసిస్తుంటే.. మరికొందరు ఇలాంటి జల సుడిగాలులు సముద్రంలో ప్రయాణించే పడవలు, నౌకలకు ప్రమాదకరంగా మారవచ్చని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు రెండు భారీ సుడిగాలులు ఒకేసారి ఏర్పడటం నిజంగా అరుదైన దృశ్యమంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవీ చదవండి:

ప్రసవించిన నిమిషాల్లోనే.. పసికందును విసిరేసిన బాలిక!

ఇజ్రాయెల్‌లో నెతన్యాహుకు షాక్.. ఐసెన్‌కాట్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం

Updated Date - Nov 11 , 2026 | 04:36 PM