‘ట్రయల్’ అదిరింది
ABN , Publish Date - Feb 22 , 2026 | 09:18 AM
మాల్స్‌లో ట్రయల్ రూమ్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. అయితే ఈ హైటెక్ ట్రయల్ రూమ్ మాత్రం వేరే లెవల్. ఇందులో నాలుగు వైపులా ఉన్న అద్దాలు కేవలం మనం చూసుకోవడానికే కాదు... హైటెక్ ఇంటరాక్టివ్ డిస్‌ప్లేలుగానూ పనిచేస్తాయి.
మాల్స్‌లో ట్రయల్ రూమ్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. అయితే ఈ హైటెక్ ట్రయల్ రూమ్ మాత్రం వేరే లెవల్. ఇందులో నాలుగు వైపులా ఉన్న అద్దాలు కేవలం మనం చూసుకోవడానికే కాదు... హైటెక్ ఇంటరాక్టివ్ డిస్‌ప్లేలుగానూ పనిచేస్తాయి. లోపల ఉన్న టచ్ స్ర్కీన్‌పై వైబ్, చిల్ (ఈ రెండూ ఇండోర్ లైటింగ్, సాయంత్రం వేళ ఉండే వెలుతురును సూచిస్తాయి), లోకల్ (బ్రైట్ డే లైట్), హైప్ (డార్క్ షేడ్స్, కలర్ ఫుల్ లైట్స్) అనే నాలుగు ఆప్షన్లు ఉంటాయి. వాటిలో మనకి కావాల్సిన మోడ్‌ని టచ్ చేయగానే... అక్కడున్న ఎల్‌ఈడీ ప్యానెల్స్ విభిన్న వాతావరణాలను సృష్టించి, వేసుకున్న దుస్తులు ఆయా సమయాల్లో, ప్రదేశాల్లో ఎలా ఉంటాయో చూపిస్తాయి.
అలాగే ఎంచుకున్న థీమ్‌కు తగ్గట్టుగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్లే అవుతుంది. అంతేకాదండోయ్... ట్రయల్ రూమ్‌లోకి ప్రవేశించగానే లోపల ఉన్న ఆర్‌ఎఫ్‌ఐడీ సెన్సర్లు.. కస్టమర్‌తో పాటు లోపలికి తీసుకెళ్లిన దుస్తులను ఆటోమేటిక్‌గా గుర్తించి, వెంటనే స్ర్కీన్ మీద వాటి వివరాలను (ధర, ఫ్యాబ్రిక్, సైజు) చూపిస్తాయి. అలాగే ట్రయల్ వేసుకున్న దుస్తుల సైజు సరిపోకపోతే బయటకు రావాల్సిన అవసరం ఉండదు.
అద్దం మీదున్న ‘రిక్వెస్ట్ సైజ్’ బటన్ నొక్కితే, స్టోర్ సిబ్బందికి తక్షణమే మెసేజ్ వెళ్తుంది. వెంటనే కోరిన సైజును నేరుగా ట్రయల్ రూమ్ వద్దకు తీసుకొచ్చి ఇస్తారు. కస్టమర్ ఎంచుకున్న షర్ట్‌కు ఏ ప్యాంటు లేదా ఏ యాక్సెసరీస్ బాగుంటాయో చూపిస్తూ ఏఐ సరదాగా సూచనలు కూడా ఇస్తుందట. దుబాయ్ మాల్‌లోని హెచ్ అండ్ ఎం స్టోర్‌లో ఈ హైటెక్ ట్రయల్‌రూమ్ ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి:
జీపీ భవనం కోసం అప్పు..సొంత భూమి తనఖా
Read Latest Telangana News and National News