Share News

అదృష్టం అంటే ఈమెదే.. భారత మహిళకు రూ.65 కోట్ల జాక్‌పాట్!

ABN , Publish Date - Jul 05 , 2026 | 06:52 PM

అబుదాబిలో ఓ భారత మహిళను అదృష్టం వరించింది. ప్రతి ఏటా నిర్వహించే బిగ్ టికెట్ లక్కీ డ్రాలో పాల్గొన్న ఆమె ఏకంగా రూ.65 కోట్లు గెలుచుకున్నారు. ఢిల్లీకి చెందిన 42 ఏళ్ల గృహిణి కనికా అరోరా బిగ్‌టికెట్ డ్రాలో పాల్గొని 25 మిలియన్ దిర్హామ్స్ గెలుచుకుని ఒక్కసారిగా కోటీశ్వరురాలయ్యారు.

అదృష్టం అంటే ఈమెదే.. భారత మహిళకు రూ.65 కోట్ల జాక్‌పాట్!
Abu Dhabi Big Ticket

అబుదాబిలో ఓ భారత మహిళను అదృష్టం వరించింది. ప్రతి ఏటా నిర్వహించే బిగ్ టికెట్ లక్కీ డ్రాలో పాల్గొన్న ఆమె ఏకంగా రూ.65 కోట్లు గెలుచుకున్నారు. ఢిల్లీకి చెందిన 42 ఏళ్ల గృహిణి కనికా అరోరా బిగ్‌టికెట్ డ్రాలో పాల్గొని 25 మిలియన్ దిర్హామ్స్ గెలుచుకుని ఒక్కసారిగా కోటీశ్వరురాలయ్యారు. విజేతగా తన పేరును ప్రకటించిన తర్వాత తొలుత నమ్మలేకపోయానని కనికా తెలిపారు (Abu Dhabi Big Ticket).


'మేం గెలిచామని తెలిసిన తర్వాత మా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒకవేళ ఎప్పుడైనా ఈ బహుమతి గెలిస్తే ఏమి చేయాలనే విషయంపై నా భర్త, నేను ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు నిజంగా గెలవడంతో ఎక్కడి నుంచి ప్రారంభించాలో కూడా అర్థం కావడం లేదు. ఈ విజయం పట్ల ఎంతో కృతజ్ఞతగా ఉన్నాం. ప్రతి ఒక్కరూ తమ అదృష్టాన్ని ఒకసారి పరీక్షించుకోవాలి. ఎప్పుడు కల నిజమవుతుందో చెప్పలేం' అని కనికా పేర్కొన్నారు (Indian Woman Wins Lottery).


ఈ భారీ నగదుతో ముందుగా ఒక సొంత ఇల్లు కొనుగోలు చేయాలని, కుటుంబ సభ్యులకు ఆర్థికంగా సహాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు కనికా వెల్లడించారు (UAE Big Ticket). 1992లో ప్రారంభమైన అబుదాబి బిగ్ టికెట్ డ్రా యూఏఈలో అత్యంత ప్రజాదరణ పొందిన లక్కీ డ్రాల్లో ఒకటి. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన వేలాది మంది ఈ డ్రాలో పాల్గొంటుంటారు.


ఇవి కూడా చదవండి..

హోర్ముజ్‌లో సేవా రుసుం.. మిత్ర దేశాలకు ప్రత్యేక రాయితీలు: ఇరాన్


సోషల్ మీడియా వల్ల విభేదాలు.. భార్యను చంపేసిన భర్త..

Updated Date - Jul 05 , 2026 | 07:00 PM