Share News

ట్రాఫిక్ చలానా రూ.లక్ష.. భారతీయ పర్యాటకురాలికి స్విట్జర్లాండ్ పోలీసుల షాక్..

ABN , Publish Date - Jun 01 , 2026 | 11:44 AM

భారతీయ పర్యాటకురాలికి స్విట్జర్లాండ్ ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. పర్యటన సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఊహించని రీతిలో జరిమానా విధించారు. పర్యటన పూర్తయిన ఏడాది తర్వాత స్విట్జర్లాండ్ పోలీసుల నుంచి ఈ-మెయిల్ రావడంతో సదరు మహిళ షాక్‌కు గురయ్యారు.

ట్రాఫిక్ చలానా రూ.లక్ష.. భారతీయ పర్యాటకురాలికి స్విట్జర్లాండ్ పోలీసుల షాక్..

ఇంటర్నెట్ డెస్క్: భారతీయ పర్యాటకురాలికి స్విట్జర్లాండ్ ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. పర్యటన సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఊహించని రీతిలో జరిమానా విధించారు. పర్యటన పూర్తయిన ఏడాది తర్వాత స్విట్జర్లాండ్ పోలీసుల నుంచి ఈ-మెయిల్ రావడంతో సదరు మహిళ షాక్‌కు గురయ్యారు. తన గోడును వెళ్లబోసుకుంటూ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఈ పోస్టు నెట్టింట పెద్దఎత్తున చర్చకు దారి తీసింది.


పోన్ సప్ది అనే ఎక్స్ అకౌంట్ యూజర్ తాజాగా ఓ పోస్టు చేశారు. గతేడాది తాను పర్యాటన నిమిత్తం స్విట్జర్లాండ్‌కు వెళ్లానని పేర్కొన్నారు. అయితే, విహారయాత్ర ముగిసిన ఏడాది తర్వాత ఇటీవల తనకు ఓ ఈ-మెయిల్ వచ్చిందని తెలిపారు. పర్యటన సమయంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు అక్కడి ట్రాఫిక్ పోలీసులు రూ.లక్ష జరిమానా విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మెయిల్ చూసి తాను షాక్‌కు గురయ్యానని చెప్పారు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎవరికైనా ఎదురైందా? అంటూ నెటిజన్లను అడిగారు. చలానా రుసుము తగ్గించుకునేందుకు, మాఫీ చేయించుకునేందుకు లేదా అప్పీల్ చేసుకునేందుకు సలహా ఇవ్వాలని కోరారు.


'స్విట్జర్లాండ్‌లో ట్రాఫిక్ జరిమానాలు చాలా భారీగా ఉంటాయి. నగదు చెల్లించడం ఉత్తమం. లేకుంటే దానిపై వడ్డీ పెరుగుతూనే ఉంటుంది' అని ఓ నెటిజన్ సలహా ఇచ్చాడు. 'విదేశాల నుంచి మినహాయింపు అభ్యర్థన చేస్తే జరిమానా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. షెంజెన్ వీసా బ్లాక్‌లిస్ట్‌లో పడకుండా ఉండాలంటే వీలైనంత త్వరగా జరిమానా చెల్లించండి' అని మరొకరు కామెంట్ చేశారు. ఇలా వివిధ కామెంట్ల మధ్య ఈ ఎక్స్ పోస్టును ఏకంగా 13లక్షల మందికి పైగా వీక్షించగా.. అది నెట్టింట వైరల్‌గా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి

బార్‌లో వాగ్వాదం.. 18 ఏళ్ల యువతి మృతి

పెళ్లై రెండు సంవత్సరాలు.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి..

Updated Date - Jun 01 , 2026 | 11:52 AM